పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తీర్చడం, ఆహార భద్రతను సాధించడం, పోషణను మెరుగుపర్చడం మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం'లను సాధించే దిశగా చర్యలు చేపడుతూ ఉంది. 2021- 22 సం॥లో నీటి పారుదల శాఖకు 13,237 కోట్ల 78 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదించడమైనది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 12.13% ఎక్కువ.

పరిశ్రమలు మరియు మౌళిక సదుపాయాలు

“మార్పు యొక్క గాలులు వీచినప్పుడు గోడలు నిర్మించే వారు కొందరైతే, గాలి మరలు నిర్మించేవారు మరి కొందరు”

71. రాష్ట్రాన్ని వేగవంతమైన పారిశ్రామికీకరణ మార్గంలో నడిపించడానికి పెట్టుబడిదారుల ఆటంకాలను తొలగించి వారితో స్నేహపూర్వక విధానాలు అవలంభించి అనుకూలమైన వ్యాపార వాతావరణం, బలమైన పారిశ్రామిక మౌళిక సదుపాయాలు కల్పించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబింపచేస్తూ 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వే' లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. పారిశ్రామిక అభివృద్ధి విధానం 2020- 23 ద్వారా, పారిశ్రామిక అభివృద్ధి కోసం వై.యస్.ఆర్. జగనన్న బడుగు వికాసం, విధానాలు మరియు పెట్టుబడుదారులకు జీవితకాలం ఉపయోగపడే ఎండ్-టు-ఎండ్ వ్యాపార నైపుణ్య కేంద్రమైన వై.యస్.ఆర్. ఎ.పి.-వన్ మొదలగు ఉత్తమ విధానాలను ప్రభుత్వం చేపట్టింది. 72. 2020-21 సం॥లో, కోవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ, మన రాష్ట్రం, ప్రపంచ మరియు దేశీయ పెట్టుబడిదారులకు నిరంతర ఆసక్తిని కలిగించగలిగింది. దీని ఫలితంగా 6,234 కోట్ల 64 లక్షల రూపాయలు పెట్టుబడులు రాగా, 39,578 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. ఈ విధంగా 17వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అమలు చేసే విధానాలను బలోపేతం చేయడం మరియు స్థిరమైన అభివృద్ధి కొరకు ప్రపంచ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం' చేరుకుంటాము. అదనంగా, 117 పెద్ద కంపెనీలు తమ తమ యూనిట్లను మన రాష్ట్రంలో స్థాపించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ

35