పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గత ప్రభుత్వం పంపిణీ చేసిన 4,63,697 ఇళ్ళ పట్టాలతో పోలిస్తే ఆరు (6) రెట్లు ఎక్కువ అని గౌరవ సభకు తెలియచేస్తున్నాను.

60. 28 లక్షల 30 వేల లబ్దిదారులందరికీ రెండు దశలలో రూ.50,940 కోట్లు ప్రాజెక్టు విలువగల 28 లక్షల 30 వేల ఇండ్లను నిర్మించాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శక్తి నివ్వటమే గాక ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది. వై.యస్.ఆర్. జగనన్న కాలనీల పేరున 17,005 లే-అవుట్లలో ఇండ్ల స్థలాలు పంపిణీ చేయబడ్డాయి. ఈ లే-అవుట్ లలో నీటి సరఫరా, విద్యుత్, అప్రోచ్ రహదారులు, అంతర్గత రహదారులు, కాలువలు మరియు ఇతర సామాజిక మౌళిక సదుపాయాలను ప్రభుత్వం అందిస్తోంది. పట్టణ ప్రాంతాలలో అర్హత కలిగిన మహిళా లబ్దిదారులకు 2,62,000 టిడ్కో గృహాలకు సంబంధించిన 21,345 కోట్ల రూపాయల విలువగల అమ్మకపు ఒప్పందాలను కూడా మన ప్రభుత్వం అందచేస్తోంది. 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'నగరాలు మరియు మానవ నివాసాలను కలుపుకొని, సురక్షితంగా, సుస్థిరంగా మార్చడం మరియు అసమానతలను తగ్గించడం', లకు అనుగుణంగా 2021-22 సం॥గాను గృహ నిర్మాణం మరియు మౌళిక సదుపాయాల కల్పనకు 5,661 కోట్ల 57 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

గ్రామీణాభివృద్ధి

61. రాష్ట్రం సమర్థవంతంగా అభివృద్ధి చెందాలంటే గ్రామీణ జీవితాల సమగ్రాభివృద్ధి తప్పనిసరి. అనగా గ్రామాలలో విద్య, ఉపాధి అవకాశాలు, మౌళిక సదుపాయాలు, గృహనిర్మాణం, పౌర సౌకర్యాలు మరియు పర్యావరణ పరిస్థితులు అభివృద్ధి చెందాలి. గ్రామాలలో ఉత్పాదకతను మరింత పెంచడానికి ఆధునిక పద్ధతులు మరియు నైపుణ్యాలు గ్రామస్థులకు ఎప్పటికప్పుడు తెలిసి ఉండాలి. వ్యవసాయ ఆధునీకరణ, గ్రామీణ మౌళిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టడం, విద్య మరియు ఆరోగ్యం పెంపు దిశగా చర్యలు చేపట్టడం, ఆదాయ మద్దతును చేకూర్చడం, సమర్థవంతమైన సమన్వయ యంత్రాంగాలతో

30