పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యువజన సంక్షేమం - నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధి

57. మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు క్రీడా విభాగాల్లో రాణిస్తున్నారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా, 36 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇంకా 79 క్రీడా వికాస కేంద్రాల పనులు పురోగతిలో ఉన్నాయి. కడపలోని డాక్టర్ వై.యస్.ఆర్. స్పోర్ట్స్ స్కూల్ “ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్” గా గుర్తించబడింది.

58. ఈ రంగాల ద్వారా 4వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'సమగ్ర మరియు సమానమైన నాణ్యమైన విద్యను నిర్ధారించడం' మరియు 'అందరికీ జీవితకాల అభ్యాస అవకాశాలను ప్రోత్సహించడం' మరియు 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అసమానతల తగ్గింపు' లక్ష్యాలను సాధిస్తున్నాము.

గృహ నిర్మాణం

'మీ స్వప్నం బలమైనదైతే, మీ ఆకాంక్షలో చిత్తశుద్ధి ఉంటే విశ్వంలోని సమస్త శక్తులూ ఒక్కటై మీ కలను నిజం చేస్తాయి' అంటాడు పాలో కొయిలో అనే ప్రఖ్యాత రచయిత.

59. సంతృప్తికరమైన గృహకల్పన అవసరం తీరనప్పుడు, వ్యక్తుల మరియు కుటుంబాల శ్రేయస్సుపై ఇది ఎంతో గణనీయమైన ప్రభావం చూపిస్తుందనే విషయం అందరికీ తెలిసినదే. అవసరమైన మేరకు గృహాల కల్పన అనేది ఎప్పటి నుండో ప్రాథమిక హక్కుగా పరిగణింపబడుతోంది. ఇది ఇతర ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను ఆనందంగా అనుభవించడంలో ఒక కీలక పాత్ర వహిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంట్ల చొప్పున, పట్టణ ప్రాంతాలలో 1 సెంటు చొప్పున రూ. 23,535 కోట్లు మార్కెట్ విలువగలిగిన 30 లక్షల 76 వేల ఇళ్ళ స్థల పట్టాలను మహిళా లబ్దిదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇది 2014 జూన్ నుండి 2019 ఫిబ్రవరి మధ్య కాలంలో

29