పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుస్తకాలు మొదలైన వాటితో కూడుకున్న ఒక కిట్ ను అందిస్తున్నాము. ఈ విద్యా సంవత్సరం నుండి అందరు విద్యార్ధులకు ఒక ఆంగ్ల-తెలుగు నిఘంటువును కూడా ఇవ్వడానికి మన ప్రభుత్వం సంకల్పించింది.

జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన:

విద్య అంటే విషయాలను బట్టీ పట్టడమే కాదు, మనస్సును ఆలోచింప చేసే దిశగా శిక్షణ - ఆల్బర్ట్ ఐన్ స్టీన్

54. ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను పొందడానికి వీలుగా ఆహారం, వసతి గృహ ఖర్చులను భరించడానికి, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడానికి ఈ పథకాలు ఉద్దేశించబడినవి. కాలేజీ యాజమాన్యాలు పారదర్శకతగా వ్యవహరించటం కోసం ఈ పథకాల ద్వారా విడుదలయ్యే నిధులను ఆర్హత కలిగిన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తున్నాము. 2020-21 సం॥నకు గాను జగనన్న విద్యాదీవెనకు 2,500 కోట్ల రూపాయలు, జగనన్న వసతిదీవెనకు 2,223 కోట్ల 15 లక్షల రూపాయల కేటాయింపులను ప్రతిపాదించడమైనది.

55. మొత్తం 2021-22 సం॥కి మాధ్యమిక మరియు ఇంటర్మీడియట్ విద్యకు మొత్తం 24,624 కోట్ల 22 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదించడమైనది.

27