పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వై.యస్. ఆర్. పెన్షన్ కానుక

50. తన పాదయాత్రలో పింఛనుదారుల దుస్థితిని చూసిన తరువాత, గౌరవ ముఖ్యమంత్రి గారు పింఛను మొత్తాన్ని ఒకేసారి నెలకు రూ.1,000 నుండి రూ.2,250 లకు పెంచడమేకాక, ప్రతి నెల 1వ తేదీన పింఛనదారుల ఇంటివద్దే గ్రామ మరియు వార్డు వాలంటీర్ల ద్వారా అందచేస్తున్నాము. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిగ్రస్తులైన పింఛనుదారులకు 10,000 రూపాయలు అందిస్తున్నాము. పెన్షన్ల పద్దు ముందు ప్రభుత్వంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. ఈ ప్రతిపాదిత కేటాయింపుల ద్వారా 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అసమానత తగ్గింపులు' మరియు 1వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'పేదరిక నిర్మూలన' లక్ష్యాలను సాధించగలుగుతున్నాము.

విద్య


ఇహమునందు బుట్టి ఇంగితమెరుగని
జనుల నెంచిచూడ స్థావరములు
జంగమాదులనుట జగతిని పాపము
విశ్వదాభిరామ వినురవేమ.

మానవుడిగా పుట్టినందుకు జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం లేనివాడు పశు పక్ష్యాదులతో సమానం. కాబట్టి జ్ఞానార్జనే మానవజన్మ పరమార్థం అంటున్నాడు

జ్ఞాని వేమన.

జగనన్న అమ్మ ఒడి

51. చదువు విలువ తెలిసిన ప్రభుత్వమిది. పిల్లల్ని బడికి పంపడంలో అమ్మల పాత్ర ఏమిటో తెలిసిన ప్రభుత్వమిది. అందుకే పిల్లలకు బడి, గుడి, నుడి అమ్మ ఒడియే అని తలంచి 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన మన ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న లక్షలమందికి ఉపయోగపడేలా వారి మాతృమూర్తుల ఖాతాల్లో

25