పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవరత్నాల కార్యక్రమాలు మరియు ప్రభుత్వ ఇతర పథకాలు రూపొందించబడ్డాయని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

వై.యస్.ఆర్. బీమా

43. 2020 అక్టోబర్ 21 నాడు 1 కోటి 41 లక్షల మంది అర్హతగల పేద కుటుంబాలకు ఉచిత బీమా అందించే ఉద్దేశ్యంతో 100% ప్రీమియం ఖర్చును తానే భరిస్తూ ప్రభుత్వం వైయస్.ఆర్. బీమా పథకాన్ని ప్రారంభించింది. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు నిరాశ్రయులు అవకుండా ఉండాలని ధృడ సంకల్పంతో ప్రభుత్వమే తన సొంత నిధుల నుండి 12,039 మంది మరణించిన కుటుంబాలకు 254 కోట్ల రూపాయలను క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించింది. 2021-22 ఆర్థిక సంవత్సరములో ఈ వైయస్ఆర్ బీమా పథకానికి 372 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను.

వృత్తిదారులకు సంక్షేమ పథకాలు, జీవనోపాధి-ఆర్థిక సహాయం

44. వై.యస్.ఆర్. వాహనమిత్ర పథకం ద్వారా ప్రభుత్వం ఆటో, టాక్సీ మరియు మేక్సీక్యాబ్ కలిగి ఉన్న 2 లక్షల 83 వేల మంది డ్రైవర్లకు 283 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది. వై.యస్.ఆర్. నేతన్న నేస్తం పథకం క్రింద ప్రభుత్వం 81 వేల చేనేత కుటుంబాలకు 194 కోట్ల 46 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసింది. జగనన్న చేదోడు పథకం 10 లక్షల చిరు వ్యాపారులకు వారి మూలధన అవసరాల నిమిత్తం మరియు మార్కెట్లో లభించే ఇతర అధిక వడ్డీ రేట్ల నుండి ఉపశమనం పొందడానికి, వడ్డీ లేని ఋణాలు రూ.10,000 చొప్పున మొత్తం రూ.1000 కోట్లు అందిస్తున్నాము. జగనన్న చేదోడు పథకం ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, ధోభీలు మొదలగు 2 లక్షల 85 వేల మంది లబ్ధిదారులకు 285 కోట్ల రూపాయల విడుదల చేయడం జరిగింది. ఈ పథకాల ద్వారా 8వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'ఉత్పాదకతతో కూడిన ఉపాధి మరియు గౌరవప్రదమైన పని కల్పించడం', 1వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'పేదరిక

22