పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కిట్లకు, వెంటిలేటర్లకు, ట్రూనాట్ యంత్రాల చిలకు, ఆక్సిజన్ పైప్ లైన్ల ఏర్పాటుకు, వ్యాక్సిన్ల సేకరణకు మొదలగువాటికై ఈ ఖర్చును చేయడం జరిగింది. ఇప్పటివరకు 53 లక్షల 34 వేల మందికి మొదటి విడత టీకాలు, 21 లక్షల 74 వేల మందికి రెండు విడతల టీకాలు వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్-19 మహమ్మారి నివారణకు, అవలంబించిన వివిధ పద్ధతులకు మరియు కోవిడ్-19 మహమ్మారి నుంచి ఉపశమనం పొందేందుకు చేస్తున్న నిర్వహణ వ్యూహాలను 'నీతి ఆయోగ్' ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంతో ప్రశంసించింది అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

31. ఆరోగ్యం, వైద్య మరియు కుటుంబ సంక్షేమం కోసం 2021-22 సంవత్సరానికి 13,830 కోట్ల 44 లక్షల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది 2020-21 సం॥లో చేసిన కేటాయింపుల కంటే 21.11% ఎక్కువ. ఈ కేటాయింపులు 3వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'ఆరోగ్యకరమైన జీవితాలను నిర్ధారించడం మరియు అందరికీ మంచి ఆరోగ్యాన్ని కల్పించడం' సాధించటానికి ఉద్దేశించబడ్డాయి.

మహిళల మరియు బాలల బడ్జెట్

32. ఏ సమాజమైనా స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే, ఆయా ప్రభుత్వాలు పిల్లలు మరియు మహిళలపై పెట్టే ప్రభుత్వ వ్యయమే కీలకం. మహిళలు మరియు పిల్లల కోసం వార్షిక బడ్జెట్ లో కేటాయించిన కేటాయింపులను గుర్తించడానికి మరియు అంచనా వేయడానికి ఒక పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. అంతేగాక ఇటువంటి కేటాయింపుల యొక్క పరిమాణాన్ని అర్థంచేసుకోవటానికి తదుపరి బడ్జెట్ లో కేటాయింపులను ఖర్చులను ట్రాక్ చేయడానికి ఈ యంత్రాంగం వీలుకల్పిస్తుందని, తద్వారా ప్రణాళికాబద్ధమైన మంచి ఫలితాలను రాబట్టవచ్చని ప్రభుత్వ

16