పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందించడం వలన రోజువారీ వేతన కార్మికుల, వయోవృద్ధుల మరియు దివ్యాంగుల సమయం మరియు శ్రమ ఈ కార్యక్రమం ద్వారా ఆదా అవుతున్నాయి. స్వయం ఉపాధి పథకం క్రింద షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల మరియు మైనారిటీల నిరుద్యోగ యువతకు 90% ప్రభుత్వ రాయితీతో సంచార పంపిణీ యూనిట్లను (M.D.U.) అందివ్వడం జరిగింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఈ రకమైన చొరవ ఇంతకుముందు జరిగిన నల్ల బజారు వ్యవహారములు, ఎక్కువ శాతం రంగు వెలసిన మరియు నూకలతో కూడిన బియ్యం సరఫరా వంటి అవకతవకలకు స్వస్తి పలకడం ద్వారా ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. రేషన్ ఇంటి వద్దకే పంపిణీ చేయడం ద్వారా 12వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన (S.D.G-12) 'స్థిరమైన వినియోగ ఉత్పత్తి విధానం అవలంబించడం', తద్వారా గొలుసు సరఫరా విధానం వలన జరిగే ఆహార నష్టాల తగ్గింపును సాధించ గలుగుతున్నాము.

27. గత సంవత్సరం అనగా 2020 కోవిడ్ లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను అదనంగా సరఫరా చేయడం కోసం 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3,103 కోట్ల రూపాయలు అదనపు వ్యయం చేయడం జరిగింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో నిత్యావసర వస్తువులను అదనంగా సరఫరా చేయడం కోసమై 754 కోట్ల రూపాయలను మే మరియు జూన్, 2021 నెలలకుగాను ఖర్చుచేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.

ఆరోగ్యం మరియు పోషణ

28. నాణ్యమైన మరియు అందుబాటులోగల ఆరోగ్య సదుపాయాలకు ప్రాధాన్యతను కల్పించడం ప్రభుత్వ ప్రధాన అంశాలలో ఒకటి. డాక్టర్ వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా, ప్రభుత్వ మరియు ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులలో ప్రభుత్వం పేద రోగులకు

14