పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెవెన్యూ లోటును రూ.11,654.91 కోట్లుగా అంచనా వేయడమయింది. ఇదే కాలానికి ద్రవ్య లోటును రూ.33,619.00 కోట్లుగా అంచనా వేయడమయింది. ఇవి జీఎస్‌డిపిలో వరుసగా 1.25 శాతం మరియు 3.62 శాతంగా ఉన్నాయి.

103. 2019-20 బడ్జెట్ అంచనాలు : 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,27,974.99 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. అంచనా వేసిన రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు. అంచనా వేసిన మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు. ఇందులో పబ్లిక్ రుణం అసలు తిరిగి చెల్లింపు నిమిత్తం రూ.8,994 కోట్లు చేరివున్నాయి. 2018-19 బడ్జెట్ అంచనాల కంటే 2019-20 బడ్జెట్ అంచనాలలో సుమారు 19.32 శాతం పెరుగుదల ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయం సుమారు 20.10 శాతం పెరుగుతుందని, మూలధన వ్యయం సుమారు 12.60 శాతం పెరుగుతుందని అంచనా వేయడమయింది. అంచనా వేసిన రెవెన్యూ లోటు సుమారు రూ.1,778.52 కోట్లు. ద్రవ్య లోటు సుమారు రూ.35,260.58 కోట్లుగా అంచనా వేయడమయింది. ద్రవ్య లోటు జిఎస్‌డిపిలో సుమారు 3.30 శాతం. రెవెన్యూ లోటు జిఎస్‌డిపిలో సుమారు 0.17 శాతంగా ఉంటుంది.

తుది పలుకులు

104. ఈ ప్రభుత్వ లక్ష్యం చాణుక్యుని 'చతుర్విధ వికాసాల' మాదిరిగా ఉంటుంది. అవేవంటే..

‘అనుకున్న లక్ష్యాన్ని సాధించడం.
సాధించినదాన్ని సుస్థిర పర్చుకోవడం.
సుస్థిర పరచినదాన్ని విస్తరించడం.
విస్తరించిన దాన్ని నలుగురికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం.

105. అదేవిధంగా, భారత స్వాతంత్ర స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా అప్పటి రాష్ట్రపతి శ్రీ కె.ఆర్. నారాయణన్ పలికిన మాటలను గుర్తు చేస్తున్నాను.

36