పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

99. మన రాష్ట్రంలో ఇల్లు లేదా ఒక భవనం నిర్మించాలని ప్రయత్నించే ప్రతి పౌరుడు ఇసుక త్రవ్వకంలో తీవ్ర అవినీతి తాకిడిని ఎదుర్కోవడం జరిగింది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మేము ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తాం. ఇందులో ఒక బటన్ నొక్కగానే ఆన్లైన్లో అవసరార్ధులైన పౌరులందరికీ ఇసుక లభ్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఏజన్సీలు మాత్రమే ఇసుకను విక్రయించడం జరుగుతుంది. అవినీతి లేకుండా చూస్తూనే పర్యావరణ పరిరక్షణతో పాటు పౌరుల అవసరాలను తీరడానికి ఈ విధానం ఉపకరిస్తుంది.

100. మన ప్రభుత్వంలో జవాబుదారీతనం మరియు పారదర్శకతలో సమూల మార్పును తీసుకురావాలని మేము భావిస్తున్నాం. అందుచేత, ఒక హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో మేము జ్యుడీషియల్ కమీషన్ ఏర్పాటు చేస్తాం. మేము మునుపటి భారీ కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టడం కూడా జరుగుతుంది. అందువల్ల వాటి యధార్థ విలువను పొందడం జరుగుతుంది. అన్ని ప్రాజెక్టుల అమలు కోసం కాంట్రాక్టులను, టెండర్లను కమీషన్ ఆమోదించిన తరువాతే ఇవ్వడం జరుగుతుంది. కమీషన్ ప్రస్తుతం వున్న టెండరింగ్ ప్రక్రియను కూడా సమీక్షించి, అవినీతిని నిర్మూలించి, ప్రక్రియలో పారదర్శకత వుండేలా చూడటానికి సంస్కరణలను సిఫారసు చేస్తుంది. మునుపటి ప్రభుత్వ ఉల్లంఘనల వల్ల అననుకూల ఆర్ధిక స్థితికి చేరుకున్న మన రాష్ట్రానికి ఈ చర్యలన్నీ చాలా అవసరం. పొదుపులను, అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడం కోసం ఉపయోగించుకోవచ్చు.

ఆర్థిక ఖాతాలు మరియు అంచనాలు

101. 2017-18 ఖాతాలు : ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన ఆర్థిక ఖాతాలు 2017-18 సంవత్సరానికి రూ.16,151.68 కోట్ల రెవెన్యూ లోటును, రూ.32,372.57 కోట్ల ద్రవ్య లోటును చూపుతున్నాయి. 2017-18 సంవత్సరానికి రెవెన్యూ లోటు మరియు ద్రవ్య లోటు వరుసగా జిఎస్‌డిపిలో 2.01 శాతం మరియు 4.03 శాతంగా ఉన్నాయి.

102. 2018-19 సవరించిన అంచనాలు : రెవెన్యూ వ్యయానికి సంబంధించి సవరించిన అంచనా రూ.1,26,339.05 కోట్లు. మూలధన వ్యయం రూ.20,398.15 కోట్లు. 2018-19 సంవత్సరానికి

35