పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమయం మించిపోయింది. ప్రభుత్వం అగ్రిగోల్డుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. అందువల్ల, దీని కోసం రూ. 1,150 కోట్ల మొత్తాన్ని కేటాయించడానికి ప్రతిపాదిస్తున్నాను.

జలయజ్ఞం

80. కృష్ణా, గోదావరి ఆయకట్టులను స్థిరీకరించడం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను ‘హరితాంధ్రప్రదేశ్' గా తీర్చిదిద్దడం స్వర్గీయ డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దార్శనికత. ఆయన కలను సాకారం చేయడానికి వీలుగా పోలవరం ప్రాజెక్టును జూన్ 2021 నాటికి అత్యధిక ప్రాధాన్యతతో పూర్తి చేయడానికి మరియు తగిన బడ్జెట్ ను అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మానవతా దృక్పథంతో ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు పునఃపరిష్కారం మరియు పునరావాసాన్ని పూర్తి చేయడానికి అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతుంది.

81. ఒక సంవత్సర కాలంలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు సొరంగం - 1 ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనివల్ల 1.19 లక్షల ఎకరాలకు నీటిని అందించవచ్చు. మిగిలిన ఆయకట్టు ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాల కాలం లోపుగా సొరంగం-2 మరియు 2వ దశను పూర్తి చేయడం జరుగుతుంది.

82. అవుకు సొరంగాన్ని పూర్తి చేస్తూ ఒక సంవత్సరంలో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు 1వ దశను పూర్తి చేసేందుకు, గండికోట రిజర్వాయరులో వీటి నిల్వ మరియు కడప జిల్లాలోని ఆయకట్టుదారులకు నీటి సరఫరాకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. అదేవిధంగా, కర్నూలు మరియు అనంతపురము జిల్లాలలోని 1.98 లక్షల ఎకరాలకు సాగునీటిని కల్పించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి 1వ దశను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుంది. తదుపరి, అనంతపురము మరియు చిత్తూరు జిల్లాలలోని ప్రస్తుతమున్న చెరువులను నింపేందుకు ఒక నిర్ణీత కాలావధి విధానంలో 2వ దశను పూర్తి చేయడవువుతుంది.

29