పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11.

'కష్టాల్లో ఉన్న ఐదుగు-బలహీన వర్గాల ప్రజలకు సాయం చేయనప్పుడు, వారి ముఖాల్లో చిరునవ్వు వెలిగించనప్పుడు, వారి జీవితాలకు కొత్త వెలుగు ప్రసాదించనప్పుడు అభివృద్ధికి అర్థమే లేదు'

ఈ ఆలోచనతో పేద ప్రజల కష్టాలను తీర్చడానికి మన ప్రభుత్వం 'నవరత్నా'లను మేనిఫెస్టోలో పొందుపరచి తూచతప్పకుండా అమలు చేస్తున్నది. ఈ సంవత్సరం కూడా 'నవరత్నాల' అమలు పట్ల అదే అంకిత భావంతో, బీద ప్రజలకు వై.యస్.ఆర్. పెన్షన్ మొదలగు పథకాల ద్వారా సామాజిక భద్రతను మరింత సమగ్రంగా అమలుపరుస్తున్నది.

'ప్రజా ప్రయోజన కాంక్షేగానీ-ప్రచార కాంక్ష లేకుండా బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే నినాదంగా జగన్ మోహన్ రెడ్డిగారి సారథ్యంలో ప్రభుత్వం ప్రజల ఉన్నతికోసం వ్యయం చేస్తున్నది.

12. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకపోతే అభివృద్ధిని, సంక్షేమాన్ని మనం సాధించలేం అన్నది నేను చెప్పదలచుకున్న రెండవ అంశం.

'దేశ ప్రజలు గొప్పవాళ్లయితేనే, దేశం గొప్పదవుతుంది. అలాగే పాలకులు, కార్యశీలురు మరియు ప్రజా సేవాపారాయణులు అయితేనే మంచి పనులు జరుగుతాయి. ప్రజలు మెచ్చే మంచి పనులు చేసేందుకు పాలకుడికి ఉత్సాహం, పట్టుదల, నిబద్ధత, ప్రయత్నం ఉంటే చాలు... తండ్రి వెంట బిడ్డల్లా జనం పాలకుడితో కదిలి వస్తారు... అడగకుండానే స్నేహహస్తం అందిస్తారు.' అన్నారు స్వామి వివేకానంద

వికేంద్రీకరణ పథంలో మేం వేసిన గొప్ప ముందడుగు గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయాలు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల కన్నా ఎక్కువమంది యువతను ఉద్యోగులుగా నియమించడం ద్వారా మరియు 2.5 లక్షల కన్నా ఎక్కువ

5