పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అంతేకాక, వ్యావసాయిక అవసరాలకు అందించే విద్యుత్తులో నాణ్యతను మెరుగుపరచడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఫీడర్ సెపరేషను కూడా మొదలు పెట్టింది.

96. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను విద్యుచ్ఛక్తి రంగానికి రూ. 6,984.73 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

పరిశ్రమలు

97. ఆర్థికాభివృద్ధిలోనూ, ఉద్యోగ కల్పనలోనూ అందరికీ చోటు దక్కే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. రాష్ట్రంలో వస్తువుల తయారీ, వ్యవసాయిక ఆహార పదార్థాల ప్రొసెసింగ్, జౌళి వస్త్ర పరిశ్రమ, ఆటోమొబైల్ వస్తువుల తయారీ, ఖనిజాల మీద ఆధారపడ్డ పరిశ్రమలు, రక్షణ రంగం, గగన తలం, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, పెట్రోలియం, షెట్రో రసాయనాల రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది.

98. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేవారికి అవసరమైన అన్ని రకాల పారిశ్రామిక అనుమతులు, మంజూరులు ఒక్కచోటనే లభించేలాగా ఒక సింగిల్ డెస్క్ పోర్టల్ ను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని బలపరుస్తున్నది. 2020 మార్చి 31 నాటికి 31,202 సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్‌కు దరఖాస్తులు చేరాయి. వీటి ద్వారా 1,07,583 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగల పెట్టుబడులు రూ.9,842 కోట్ల మేరకు కనిపిస్తున్నాయి. అలాగే 55,368 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగల రూ.37,582 కోట్ల మేరకు పెట్టుబడులతో 229 భారీ మెగా పరిశ్రమల స్థాపనకోసం కూడా దరఖాస్తులు నమోదయ్యాయి. 2020 మార్చి 31 నాటికి ఆయా విజ్ఞప్తులకు అవసరమైన అనుమతులన్నీ 21 రోజుల వ్యవధిలో 99.05% ఎస్.ఎల్.ఎ.తో మంజూరవుతున్నాయి.