పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వై.యస్.ఆర్. సున్నా వడ్డీ

48. స్వయం సహాయక బృందాల మీద ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించటం ద్వారా వారిలో ఎప్పటికప్పుడు ఋణాలు తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించటం కోసం వై.యస్.ఆర్. సున్నా వడ్డీ పథకం ప్రారంభించడం జరిగింది. ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,365.08 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

స్త్రీల భద్రత

ఈ సమాజం బలంగా పెరిగిందంటే, శాఖోపశాఖలుగా విస్తరించిందంటే, ఫలపుష్పాలతో శోబిల్లుతోందంటే అందుకు కారణం తల్లివేరులా నిలిచిన స్త్రీమూర్తి గొప్పదనమే. మహిళా సాధికారత దిశగా జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో అనేక చర్యలు తీసుకొంది. భారతీయ సంస్కృతికి ప్రాణశక్తిగా నిలిచిన మహిళాలోకంపై అన్ని చోట్లా జరుగుతున్న దాడులను, దుర్మార్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టాలన్నది ప్రభుత్వ సంకల్పం. మహిళలు అపహరణలకు, అత్యాచారాలకు, రకరకాల వేధింపులకు గురవుతున్న ఈ రోజుల్లో ఈ ఆకృత్యాలను తక్షణం అరికట్టి, అక్రమార్కులకు గట్టి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ సంకల్పంతోనే ఈ ప్రభుత్వం 'దిశ' చట్టం తీసుకువచ్చింది.

49. ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం 2019ని తీసుకురావడం ద్వారా, స్త్రీల రక్షణకు, భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేర పరిశోధన, విచారణ మొత్తం 21 పని దినాల్లోనే పూర్తి చేసి స్త్రీల పట్ల, శిశువుల పట్ల లైంగిక అత్యాచారాలు పాల్పడే వారి విషయంలో మరణశిక్ష విధించే విధంగా భారతీయ శిక్షా స్మృతి, నేర విచారణ స్మృతులకు సవరణలు చేపట్టడం జరిగింది. , 50. ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం 2019 ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రభుత్వం 13 ప్రత్యేక న్యాయ స్థానాలను కేవలం ఈ కారణం నిమిత్తమే నెలకొల్పింది. అదే విధంగా 13 ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది. ఉమెన్ పోలీసు స్టేషన్లను