పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. గత కొద్ది రోజులుగా కోవిడ్-19 వలన విధించిన నిర్బంధమును అంచెలంచెలుగా సడలిస్తూ, ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా మన ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ విషమ పరిస్థితులలో కూడా 2020-21 కి సంబంధించిన ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక ద్వారా ప్రజల ఆకాంక్షలను నేరవేరుస్తామని తెలియచేస్తున్నాను.

'అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించిన వాడే నిజమైన నాయకుడు'

4. అనే మాటలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మేనిఫెస్టోని తయారు చేసి, ఆ మేనిఫెస్టోలోని వాగ్దానాలలో 90 శాతము మొదటి సంవత్సరంలోనే నెరవేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డిగారికి ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అద్భుత విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. జాతిపిత మహాత్మాగాంధీగారి స్ఫూర్తిదాయక పలుకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం:

'మన చర్యలే మన ప్రాధాన్యతలను ప్రదర్శిస్తాయి'

5. మన ప్రియతమ నాయకులు కీ॥ శే॥ శ్రీ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు నమ్మిన ఈ దృక్పథాన్నే వారసత్వంగా అందిపుచ్చుకున్న మన గౌరవ ముఖ్యమంత్రిగారు ప్రజల జీవితంలో మేలి మార్పులు తెచ్చినప్పుడే మన ముందుచూపుకు సార్థకత అని భావిస్తారు. ప్రియతమనేత అడుగు జాడలలోనే మన ప్రభుత్వం కూడా రైతులు, కౌలు రైతులు, తల్లులు, యువత, స్వయం ఉపాధిలో ఉన్నవారు, బడుగువర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలపై దృష్టి పెట్టి, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం అంచనాలకు మించి కృషిచేస్తున్నది.

6. మన ప్రభుత్వం జూన్ 2019 లో అధికారాన్ని అందుకునేటప్పటికీ మనం పరిష్కరించవలసిన ఎన్నో సమస్యలు, అడ్డంకులు మన ఎదుట ఉన్నాయి. ఎన్నో పెను సవాళ్ళకు మనం ఎదురీదవలసి వచ్చింది. అప్పటికే నీరసిస్తున్న మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ

2