పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బీమా నిమిత్తం రైతు వాటా ప్రీమియం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంటల బీమా పథకాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు బదులు రాష్ట్ర ప్రభుత్వం తన భుజస్కంధాల మీదకు తీసుకున్నది. డా.వై.యస్.ఆర్. పంటల ఉచిత బీమా పథకం కింద రైతులకు మేలుచేకూర్చే లక్ష్యంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.500 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

34. వడ్డీలేని ఋణాలు - పంటల నిమిత్తం తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించే అలవాటు రైతులలో పెంపొందించడానికి లక్ష రూపాయల వరకు పంట ఋణాలపై ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తోంది. ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,100 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

35. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం వెనుక ప్రధాన సూత్రధారి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులే. రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాలలోనూ 11,158 రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పాలనీ సంకల్పించాం. ఈ కేంద్రాలు ఒకవైపు రైతులకు అవసరమైన వస్తు సామాగ్రి సరఫరా బాధ్యతతో పాటు, మరొకవైపు ఉత్తమ వ్యవసాయిక విధానాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసే బాధ్యత కూడా నిర్వర్తిస్తాయి. మల్టీ బ్రాండ్ నాణ్యమైన ఇన్‌పుట్‌ సరఫరా, యం.ఎస్.పి. సమాచారం, సాంకేతిక వ్యవహారాలలో మార్గదర్శకత్వం, వ్యవసాయ పనిముట్లు అద్దెకు తీసుకోవటం, నేల మరియు విత్తనాల పరీక్ష, బ్యాంకు నుంచి ఋణాలు తీసుకోవటంపై శిక్షణ మొదలైనవి కూడా ఈ కేంద్రాలు చేస్తాయి. ఇటువంటి రైతు భరోసా కేంద్రాల స్థాపన నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 100 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

36. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మొదలైన వస్తు సామాగ్రి సరఫరాలో నాసిరకమైన నకిలీ సరఫరా జరగకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు గాను వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలోనే నాణ్యతా పరీక్షా కేంద్రాలను నెలకొల్పడానికి నిశ్చయించింది. రాష్ట్రం అంతటా 160 డా.వై.యస్.ఆర్. వ్యవసాయ పరీక్షా కేంద్రాలను నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 147

14