పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొంత ఎరువు వేసి, కడివెడు నీళ్లు పోస్తే చెట్టు నీడనిస్తుంది, మంచి ఫలాలనిస్తుంది. ఎండిపోయిన తరువాత కూడా ఏదో విధంగా ఉపయోగపడుతుంది. తన పుట్టుకను సార్థకం చేసుకుంటుంది. మరి అన్నం పెట్టి ప్రాణం నిలబెడుతున్న రైతుపట్ల మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి.

'దున్నేవాడు లెక్క చూస్తే నాగలి కూడా మిగలదన్నది' సామెత.

వారి బాగోగులకోసం ఎన్ని కష్టనష్టాలనైనా ఎదుర్కొని పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాం. అందుకే మాది రైతుల ప్రభుత్వమని చెబుతున్నాం...

31. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది. వ్యవసాయ రంగం మన ఆర్థికాభివృద్ధిలో ప్రధానపాత్ర వహించడమే కాకుండా, మనకు ఆహార భద్రతను సమకూరుస్తున్నది. నాలుగింట మూడువంతుల కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది. ఇందువలన రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించడమే కాక, మరెన్నో పథకాలకు ఆర్థిక సహాయాన్ని పెంపుదల చేసింది.

32. డా. వై.యస్.ఆర్. రైతు భరోసా - పి.ఎం. కిసాన్ పథకం 2019 అక్టోబరు 15న ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి వారి వ్యవసాయిక అవసరాల నిమిత్తం రూ.13,500 వార్షిక పెట్టుబడి సమకూర్చబడుతున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 46 లక్షల 51 వేల అర్హులైన రైతు కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందింది. ఇందులో 1 లక్ష 58 వేల కౌలుదారు కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం కొనసాగించడానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,615.60 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

33. డా. వై.యస్.ఆర్. పంటల ఉచిత బీమా పథకం - పి.ఎం.ఎఫ్. బి.వై.మరియు ఆర్.డబ్ల్యు. బి.సి.ఐ.ఎస్.ల కింద గుర్తించబడిన అన్ని పంటలకు 2019 ఖరీఫ్ కాలానికి

13