పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యక్షా!

'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం'

అన్ని ఇంద్రియాలలో నేత్రాలు ప్రధానం అని అర్థం.

27. అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు, సదుపాయాలు అందించే ఉద్దేశ్యంతో 2019 అక్టోబరు 10వ తేదీన ప్రభుత్వం 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో మొదటి విడతగా 69 లక్షల మంది పాఠశాల విద్యార్థులను పరీక్షించడం జరిగింది. రెండవ విడతగా 4 లక్షల 60 వేల మంది పిల్లలకు పరీక్షలు చేపట్టాం. మూడవ దశలో 60 ఏళ్ళు పైబడిన వారందరికీ పరీక్షలు చేపట్టబడతాయి. కళ్ళద్దాలు అందించబడతాయి. ఆ పరీక్షల్లో అవసరమని నిర్ధారణ అయిన వారికి శస్త్ర చికిత్సలు చేపట్టబడతాయి. తదనంతర దశల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ 'కంటి వెలుగు' పథకం కింద లబ్ది పొందనున్నారు. ఇందుకు గాను 2020-21 సంవత్సరానికి గాను రూ.20 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

28. అత్యవసర వైద్యసేవలను సకాలంలో అందించడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు గాను ప్రస్తుతం 108 అంబులెన్స్ పథకం కింద ఉన్న 439 అంబులెన్సులను ప్రతి మండలానికి ఒక్కొక్క అంబులెన్సు వచ్చు విధంగా, అలాగే 292 ఉన్న సంచార వైద్య వాహనాలను ప్రతి మండలానికి ఒక్కొక్క సంచార వైద్య వాహనం వచ్చు విధంగా పెంచనున్నాం. మొత్తం మీద 1,000 కొత్త వాహనాలు ఈ సంవత్సరంలో ప్రారంభించబతాయి. 108 మరియు 104 సేవల కింద ఇందుకు గాను 2020-21 సంవత్సరానికి రూ.470.29 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

29. వైద్య, ఆరోగ్య రంగంలో 'నాడు నేడు' పథకం కింద సబ్ సెంటర్ల నుండి టీచింగ్ హాస్పిటల్స్ దాకా మౌలిక సదుపాయాలు, వైద్య సామాగ్రి, అదనపు మానవ వనరుల కల్పనను ప్రభుత్వం చేపట్టింది. గ్రామ, వార్డు స్థాయిలో 11,000 కు పైగా డా.వై.యస్.ఆర్. హెల్త్ క్లినిక్ లను నెలకొల్పుతున్నది. రాష్ట్రం అంతటా దశలవారీగా 15 కొత్త వైద్య కళాశాలలను

11