ఈ పుట అచ్చుదిద్దబడ్డది
- ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత నమూనాలతో అంతర్జాతీయ వేదికలపై ప్రశంసించబడి,అందరి దృష్టిని ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయి నగరంగా నిలిచే ప్రజా రాజధాని అమరావతిని నిర్మిస్తామని మనం కలగన్నామా?
- వినూత్నంగా నిర్మితమయే మన రాజధాని నగరం అమరావతికి 28,074 మంది భూయజమానులు భూసమీకరణ విధానం ద్వారా స్వచ్చందంగా తమ భూములను ఇవ్వటానికి ముందుకు వస్తారని; 2,28,559 మంది ఉదారంగా విరాళాలు ఇస్తారని ఆశించామా?
- 70 ఏళ్ళ ఆంధ్రుల కల, మనరాష్ట్ర జీవనాడి అయిన పోలవరం డ్యామ్ శరవేగంగా పూర్తి అవుతుందని, దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని మనం ఊహించామా?
- నదుల అనుసంధాన ప్రక్రియలో దేశానికే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకం అవుతుందనితలచామా?
- 'మన గడ్డమీద నుంచే మన పరిపాలన' మరియు మన న్యాయవ్యవస్థ అమరావతి నుండే కొనసాగాలన్న కల ఇంత స్వల్ప సమయంలో నెరవేరగలదని అనుకొన్నామా?
- రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు అభివృద్ధి చేయగలమని అప్పట్లో ఊహించామా?
- తీవ్ర ఆర్థిక లోటులో కూడా, పెద్ద ఎత్తున రైతులకు సంపూర్ణ ఋణమాఫీ చేస్తామని, స్వయం సహాయక మహిళా సంఘాలకు 'పసుపు-కుంకుమ' అందిస్తామని, పెన్షన్ల మొత్తాన్ని 10 రెట్లు పెంచుతామని, సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకం అవుతుందని భావించామా?
- గ్రామీణ జీవన దశలు అన్నింటికీ వర్తించేలా అద్భుతమైన మౌలిక సదుపాయాలను నెలకొల్పే సామర్థ్యాన్ని పెంపొందించి దేశానికే మార్గదర్శకమైన నమూనాని మనం అందిస్తామని అప్పట్లో ఊహించామా?
Adversity causes some men to break; others to break recods.
-William Arthur Ward, an American author
2