పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2019-20 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సుంకాలలో ఎటువంటి పెరుగుదలని ప్రతిపాధించలేదు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ప్రోత్సహించడానికి ఒక యూనిట్ విద్యుత్ కు 1 రూపాయి సబ్సిడీ ప్రతిపాదించడం జరిగింది. దీనివలన చార్జింగ్ స్టేషన్లకు యూనిట్లకు అయ్యే వ్యయం రూ.6.95 నుండి రూ.5.95 కి తగ్గుతుంది. ఈ ప్రతిపాదన వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి వస్తుంది.

122. ఫైబర్ గ్రిడ్: రాష్ట్ర ప్రభుత్వము యొక్క 5 గ్రిడ్లలో ఫైబర్ గ్రిడ్ ఒకటి. రాష్ట్ర సాంఘిక ఆర్ధిక అభివృద్ధి కొరకు అన్ని గృహములకు గ్రామీణ ప్రాంతాలలోని మారు మూలలకు ఇంటర్నెట్ సేవలను ఎక్కువ స్పీడ్ తో అందుబాటు ధరలో అందించుటకు ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుచేయటమైనది. రాష్ట్రములోని మారుమూల మరియు ఏజెన్సీ ఏరియాలకు ఉచిత స్పీస్ ఆప్టిక్ కమ్యూనికేషన్ వ్యవస్థను మన ప్రభుత్వము ప్రారంభించినది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీడియో కాన్ఫరెన్స్ ద్వార ప్రపంచములోనే తొలిసారి ఒక మారుమూల గిరిజన గ్రామమును, దావోస్‌లో జరిగిన అంతర్జాతీయ ఫారముతో కలిపినది. రాబోవు 5 సంవత్సరాలలో రాష్ట్రంలోని ప్రతి గృహమునకు ట్రిపుల్ ప్లే కనెక్టవిటీని, అన్ని గ్రామపంచాయితీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు 3,000 ప్రాంతాలలో వైఫై ఎపిక్స్, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతములలో గల 6,000 అదనపు ప్రభుత్వ తరగతి గదులకు, టెలికం టవర్లు టెక్నాలజీ ద్వార అందించడమైనది. ఫైబర్ గ్రిడ్ ప్రొజెక్ట్‌లో భాగముగా 620 మండలాలలో 4,000 గ్రామములలో 6 లక్షల సంస్థలకు నెలకు రూ.149 చొప్పున ట్రిపుల్ ప్లే సర్వీసులు అందించుచున్నది.

123. విమానాశ్రయాలు: మా ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య 5.5 మిలియన్లకు పెరిగింది. విమాన ప్రయాణికులకు సంఖ్యతో జాతీయ సగటులో 12 శాతం వృద్ధి ఉండగా, రాష్ట్రంలో వృద్ధి 38 శాతం గా ఉంది. మా ప్రభుత్వం విమాన ఇంధనంపై పన్నును 16 శాతం నుండి 1 శాతం తగ్గించింది. అంతేకాక, ప్రస్తుత ఉన్న విమానాశ్రయాలను విస్తరించడమే కాక, భోగాపురం, ఓర్వకల్, దగదర్తి వంటి నూతన విమానాశ్రాయల ఏర్పాటుతో పాటు కుప్పం వద్ద పియర్ స్ట్రిడ్ ను నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది

124. నౌకాశ్రయాలు: రాష్ట్రాన్ని తూర్పుతీర ప్రాంత నౌకా వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ పోర్ట్ పాలసీ-2015 ని రూపొందించడం జరిగినది మరియు రాష్ట్రంలో నూతనంగా భావనపాడు మరియు కాకినాడ సెజ్ పోర్ట్లను పి.పి.పి. పద్ధతిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. 2025 నాటికి భావనపాడు, కాకినాడ, మచిలీపట్నం మరియు రామాయపట్నం వంటి నాలుగు నాన్ మేజర్ పోర్ట్‌లను అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 125. గ్యాస్ మౌళిక సదుపాయములు: నాచురల్ గ్యాస్ ఒక పరిశుద్ధమైన, సహజమైన ఇంధన వనరు. గ్యాస్ కు సంబంధించిన మౌలిక సదుపాయములు అభివృద్ధి కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందెన్నడూలేని విధంగా కొన్ని విధాన పరమైన నిర్ణయములు తీసుకున్నది. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అనుసంధానించే గ్యాస్ గ్రిడ్ ను నెలకొల్పుటకు నిర్ణయించింది. నగరాలలో గ్యాస్ పంపిణీ కొరకు

23