పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉన్న 4.40 లక్షల ఇళ్ళను వివిధ పథకాలద్వారా పూర్తిచేయాలని పూనుకున్నాము. పట్టణ ప్రాంతాలలో 10,15,665 ఇళ్ళు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి.

మానవ వనరుల అభివృద్ధి

82. ఆరోగ్యం: ఈ శాఖకు 2018-19 సంవత్సరమునకుగాను 8463 కోట్ల రూపాయలు కేటాయించాము. ఇది 2014-15తో పోలిస్తే దాదాపు రెట్టింపు అయింది. ఎంఎంఆర్ ను 2014-15 నాటికి ఉన్న 83 నుంచి 2018-19లో 65.81కి మరియు అలాగే ఇదే కాలానికి ఐఎంఆర్‌ను 37 నుంచి 10.51కి తగ్గించగలగడం ఈ రంగంలో మేము సాధించిన గొప్ప విజయము.

83. ప్రజారోగ్య మెరుగుదలతో పాటు ఇతర చిన్నపాటి ఖర్చులను తగ్గించే క్రమంలో తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ ఎన్.టి.ఆర్ బేబి కిట్స్, చంద్రన్న సంచార చికిత్స, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఎన్.టి.ఆర్. వైద్య పరీక్ష, ఎన్.టి.ఆర్. వైద్య సేవ, ముఖ్యమంత్రి ఇ-కంటి కేంద్రం, ముఖ్యమంత్రి బాల సురక్ష (RBSK), ఇ-ఔషది, ఉచిత డయాలసిస్, వంటి కార్యక్రమాలు మా ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆరోగ్యరక్ష, ఉద్యోగుల ఆరోగ్య పథకం, పాత్రికేయుల ఆరోగ్య పథకం మరియు అమరావతి నివాసితుల ఆరోగ్య పథకం వంటి కార్యక్రమాలును కూడా మా ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ కవరేజి క్రింద అమలు చేస్తున్నది. అంతేకాక క్యాన్సర్ సెంటర్లను ప్రతి జిల్లాలో కూడా అందుబాటులోకి తెస్తున్నాము.

84. మేము అమలు చేస్తున్న ఎన్.టి.ఆర్. వైద్యసేవ పథకం ద్వారా 5,330 కోట్ల రూపాయల ఖర్చుతో 12 లక్షల రోగులకు లబ్ధి చేకూర్చగలిగాము. ఈ పథకంలో ప్రతి కుటుంబానికి ఉన్న అవధిని 2.5 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేటాయింపులను ప్రస్తుతమున్న 1,000 కోట్ల రూపాయలను 2019-20 సంవత్సరమునకు 1,200 కోట్లకు పెంచుతున్నాము.

85. మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నాణ్యమైన సేవలు అందించే ఉద్దేశ్యంతో 2016 లో తీసుకువచ్చిన డయాలసిస్ కార్యక్రమంలో భాగంగా పిపిపి పద్దతిలో ఏర్పాటు చేసిన డయాలిసిస్ కేంద్రాలను 14 నుండి 48కి పెంచాము. దీనితోపాటు మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎన్.టి.ఆర్. భరోసా పథకం ద్వారా 2,500 రూపాయలు నెలవారి పింఛనును అందిస్తున్నాము. ఈ పింఛనును ఎన్.టి.ఆర్. వైద్యసేవ పథకంలో నమోదు చేసుకున్న అన్ని ఆసుపత్రులలో డయాలిసిస్ చేయుంచుకుంటున్న రోగులకు కూడా వర్తింపచేశాము.

86. ఈ కార్యక్రమాలన్ని ప్రజల ఇతర ఖర్చులను గణనీయంగా తగ్గించ గలిగాయి.

87. 2019-20 సంవత్సరమునకుగాను, ఆరోగ్య సంస్థలలో సదుపాయాలు అభివృద్ధి కొరకు 329 కోట్లను డ్రగ్స్ మరియు మందుల కొనుగోలు కొరకు ప్రస్తుతమున్న 300 కోట్ల రూపాయల పద్దును పెంచుతూ 402 కోట్ల రూపాయలకు కేటాయింపులు జరుపుతున్నాము. ఈశాఖ కేటాయింపులను 2019-20

16