పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టాంగయోగసారము

27

షష్ఠాబ్దంబున ఖడ్గాభేద్యుం డగు. సప్తమాబ్దంబున భూమి నంటకుండు. అష్టమాబ్దంబున అణిమాద్యష్టైశ్వర్య సంపన్నుం డగు. నవమాబ్దంబున నధోగమనుం డగు. దశమాబ్దంబున మనోవేగుం డగు. ఏకాదశాబ్దంబున విశ్వవశత్వంబు గలవాఁ డగు. ద్వాదశాబ్దంబున సాక్షాదీశత్వంబు నొందు, నిది హఠయోగంబగు, నింక రాజయోగంబుఁ జెప్పెద నది సూక్ష్మాష్టాంగయోగపూర్వకంబుగా నభ్యసింపవలయు నెల్లనిన.

సూక్ష్మాష్టాంగయోగము

సీ. ఆహార నిద్రా దురాసేంద్రియ వ్యాప్తు
        లణఁచి శాంతము నొందినది యమంబు
    నిశ్చల గురుభక్తి నిస్సంశయము సుయో
        గాసక్తి తృప్తి యేకాంతవాస
    పరతయు వైరాగ్యభావంబుకరణి ని
        గ్రహమును నియమంబు సహజసుఖము
    నొసఁగు నాసనమునం దుండుట నిస్పృహ
        త్వంబు నొందుటయు నాత్మను మనంబు
గీ. నదిమి కుదిరించి నిల్పుటే యాసనంబు
    ప్రకట రేచక పూరకుంభక సమేత
    మైన శ్వాసలలో నప్రయత్నముగను
    గుదురజేసిన యనిరుద్ధకుంభకమున.

వ. ప్రాణుని స్థిరముగా నిలిపి ప్రపంచం బనిత్యం బని తలంచుటే ప్రాణాయామంబగు, నంతర్ముఖంబైన నిర్మలచిత్తంబున చైతన్యజాలంబుల నణఁచుటయును బహుప్రకారంబులై జనించు మనోవికారంబుల నేర్పరించి తద్వికారగ్రసనంబు చేసి మనంబును నిర్వ్యాపారంబుగా నిలుపుటే ప్రత్యాహారం బగు. స్వస్వరూపానుసంధానభావంబుచే ద్వితీయరహితాత్మానుభవంబున సర్వప్రపంచంబు నాత్మగా నెఱిఁగి సకలభూతదయాసమత్వంబు