పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

అష్టాంగయోగసారము

ఈ క్రమంబుగా ధౌతి, వస్తి, నేతి, త్రాటక, కాళి, కపాలభాతి యను నీ షట్కర్మంబులు క్రమముగా నభ్యసింప రోగరహితంబులై నాడులు వశవర్తు లగుచుండునపుడు సిద్ధాసనాసీనుండై కూర్చుండి రేచక పూరక కుంభక యుక్తంబైన ప్రాణాయామపూర్వకంబుగా షణ్ముఖీముద్రాభ్యాసంబు చేయుచుండవలయు, నావల

ఆనందసిద్ధి

సుషుమ్నానాడికిఁ గారణమైన మూలాధారబ్రహ్మరంధ్రమునంగల రంధ్రమే భూతత్త్వమనియు, యిడా పింగళనాడుల ముఖమనియు చెప్ప నొప్పు. తత్కారణంబుచే నమృతంబు స్రవించు, నయ్యమృతంబు స్రవించి పోవుటచే మనుష్యశరీరమునకు మృత్యువు కలుగును. తదమృతము నిలుపుటకై మెడిమచేత యోనిస్థానంబును లెస్సగా నొత్తిపట్టి గుదము నూర్ధ్వముగా నెగయనొత్తి యపానవాయువును మీఁదిఁ కాకర్షించి బలాత్కారంబున నూర్ధ్వంబుగా నాకుంచంబుజేయ నది మూలబంధం బగు. దీనిచేఁ బ్రాణాపానవాయువులు నాదబిందువులును నైక్యమై యోగసిద్ధిప్రదంబగు. అపానవాయువు మీది కెగసి యగ్నియందు పొందుచుండగా నప్పు డగ్నిజ్వూల వాయువుతోఁ గూడి పొడవుగా వృద్ధినొందునప్పు డగ్నిపూరుషాపానవాయువులు ప్రాణవాయువును బొందు, నివ్విధంబున దేహముందుఁ బుట్టిన యగ్ని మిక్కిలి ప్రజ్వరిల్ల నందు నిద్రించిన కుండలీశక్తి తపింపబడి మేల్కొని కట్టెచేతఁ గొట్టబడిన భుజగశ్రీవలె నిశ్వాసంబు నిట్టూర్పుబుచ్చి చక్కగా సుషుమ్నాద్వారము. బ్రవేశించి శాంతమై బ్రహ్మనాడినడుమ పొందు గనుక; తదభ్యాసంబు జేయుచుండిన మూలశక్తి యాకుంచనం బగు. మధ్యశక్తి మేల్కొను, నుర్ధ్వశక్తిపాతంబు నొదవు. పవనుండు మధ్యమార్గంబునం జననోపు. నదియునుంగాక మూలం బాకుంచనంబై నాభి నొత్తిన నది యొుడ్యాణబంధంబగు కంఠంబు సంకుచితంబై