పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

అష్టాంగయోగసారము

గీ. లర్పణముగాగ రెండు నొకర్ధఘటిక
    లల విగడియలు పదియాఱు హంస లొక్క
    నాలు గగుచుండు నీరీతి ననుదినంబు
    జరుగు నరువది గడియలై జనుల కెల్ల.

వ. ఇవ్విధంబున నుదయాద్యుదయ పర్యంతము నడుచుచున్న యిరువదియొక్క వేయియు నాఱునూఱు హంసలు నజపం బనందగు నిట్టి యజపాగాయత్రీమహామంత్రంబు గురుముఖంబుగా నెఱిఁగి యరుణోదయంబున శుచియై పద్మాసనాసీనుండై కూర్చుండి నాసాగ్రావలోకనుండై సప్తకమలాధిదేవతలకు శ్వాస, ధ్యానపూర్వకంబుగా నజపాగాయత్రీమహామంత్రంబు నర్పణంబు జేయుచుండుట మంత్రయోగం బగు ఇంక లయయోగం బెట్లనిన.

లయయోగవిధానము

విజనస్థలంబునఁ బద్మాసనాసీనుండై కూర్చుండి దిగువ నాసికాగ్రముఁ జూచుచు పై నున్నది సాధింపుచు పై నాసికాగ్రంబుఁ జూచుచు దిగువ నున్నది సాధింపుచు రెండుతర్జనులచేత రెండుకర్లద్వారములున్ను రెండనామికలతో రెండునాసికాద్వారములున్ను బంధించి శిరంబు వంచి యేకాగ్రమనస్కుండై, తెలివితో నూర్ధ్వంబుగాఁ జూడ నది రాధాయంత్రంబను ముద్రయగు. తన్ముద్రాభ్యాసంబుఁ జేయుచున్న బ్రహ్మరంధ్రంబునందుఁ బ్రణవనాదంబు దశవిధధ్వనులుగా మ్రోయుచుండు నది యెట్లన్నను మొదట శింజినీగతియు, రెండవది తరగఘోషంబును, మూడవది ఘంటారావంబుసు, నాలుగవది వేణువాదంబు, నైదవది వీణాస్వనంబు, నాఱవది భేరీధ్వని, ఏడవది తాళధ్వని, ఎనిమిదవది శంఖారావంబు, తొమ్మిదవది మృదంగశబ్దంబు, పదవది మేఘనాదంబు కరణి వినంబడు నిట్లు క్రమక్రమంబుగా నాదానుసంధానంబుఁ జేయ నందు నీ నాదంబులు