పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టాంగయోగసారము

15

బ్రహ్మపదంబు నొందుదురు. ఇవి స్థూలాష్టాంగయోగంబులగు. ఇంక మంత్రలయహఠయోగంబులు గల వనిన వరాహస్వామికి మ్రొక్కి భూదేవి యిట్లనియె.

గీ. దేవ యష్టాంగయోగముల్ తెలియ వింటి
    రమ్యతరమంత్రలయహఠరాజయోగ
    ములను నామీద దయయుంచి తెలుపు మనిన
    శ్వేతకిటి భూమిదేవి నీక్షించి పలికె.

ఇక మంత్రయోగ విధానంబు జెప్పెద నెట్లనిన.

మంత్రయోగవిధానము

సీ. పూని విసర్జనస్థానంబునందుండు
        నాధారకమలంబునందు వ శ ష
    సలు నాలుగైన రేకులయందు దీపించు
        విఘ్నేశుఁ డచ్చట వెలుఁగుచుండు
    దానికి నంగుళద్వయము పై నుత్పత్తి
        కైన స్వాధిష్ఠానమందు బ భ మ
    య ర ల కారము లుండు నది యాఱుదళములం
        దజుఁ డుండు నుత్పత్తి కాఢ్యుఁ డగుచు
గీ. మెరసి యష్టాంగుళములకు మీఁద డాది
    ఫాంతవర్ణావళిని గూడి పదిదళముల
    నొప్పు మణిపూరకము నాభి నుండు విష్ణు
    డచటఁ దా స్థితికర్తయై యమరుచుండు.
సీ. పదియంగుళములకుఁ బైహృదయస్థాన
        మం దనాహతపద్మ మమరు, కాది