పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టాంగయోగసారము

13

    యా మతియం దింద్రియవ్యాప్తు లణఁగింప
        నందొప్పుగా నిల్చు ననిలగతులు
    కమఠ మంగములను గదలనీయక కుక్షి
        యందు దాఁచినరీతి నఖిలవిషయ
    కరణానిలములఁ జక్కగఁ బట్టి నిల్పగా
        నదియే ప్రత్యాహార మనగఁ బరగు
గీ. దాన దేహంబు సుస్థిరత్వంబు నొందు
    దీపితంబుగ నేకాగ్రదృష్టి నిలుచు
    దీని సాధించి యటమీఁద ధ్యానయోగ
    మెలమి సాధింపవలె నది యెట్టు లనిన.

ధ్యానయోగము

గీ. రోషదుర్భావవైకల్యదోషములను
    కపటవంచనముల వీడి గర్వ మణఁచి
    సద్గురూక్తులు వినుచును శాంతుఁ డగుచు
    నెపుడు కరువలి నూని సర్వేంద్రియముల.
చ. అపు డుపసంహరించి గురుఁ డానతి యిచ్చిన లక్ష్యముద్రలం
    దుపముగ(?)మానసంబు నిడి యొండొకచింతయు లేక చిత్తమున్
    జపలత బొందనీయకయు షడ్వనజంబులఁ నూని లోనఁ దా
    నెపుడుఁ జలింపకున్న మతి కింపొనరించెడి ధ్యానయోగమై.
    ఇది ధ్యానయోగం బగు నింక ధారణాయోగం బెద్ది యనిన.

ధారణాయోగము

చరణాది జానుపర్యంతంబు పృథ్వీతత్త్వంబుస కధిదైవతంబైన బ్రహ్మకు లకారయుక్తంబైన వాయుధారణాభ్యాసంబున ధ్యానింపఁ బృథ్వీజయంబు గలుగు. జాన్వాదినాభిపర్యంతంబు జలతత్త్వంబగు, తదధి