పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కరరూపశ్వరవర్ణో
త్కరములలో నొకటి యయిన గగ
ఖర సారమస్తురంగము
అరయంగా పుత్రమిత్రహానిం జేయున్.

22


గీ.

గార్ధబంబు రీతి ఘనవర్ణగౌరాళి
యేహయంబు పెట్ట నెసగునట్టి
హయము గౌరవవృష్టి యదియు
చిత్రపదులు పతుల శిరుల నణచు.

23


గీ.

శిరము పుచ్ఛమూలంబు వరుసజ
దగ్ధచర్మోపమానగంధంబులైన
వాజి తలపోయ కెక్కెడువానియిల్లు
యనలశిఖలకు నాహార మగుచునుండు.

24


శిరము తోకయును కాలినచర్మముల వాసన గలిగిన నా గుర్రమును నిలుపజనదు. ఎవనియింట నాగుర్ర ముండునో వాని యిల్లు యగ్నిహోత్రున కాహుతి యగును.


చ.

కవలనుచుం హయంబులు తగం జనియించిన వాని యిల్లు దా
న.............................................................................నా
చవిగొన గాన తక్కిన విచారము సేయక దేవతా
దినిజుల కిచ్చు టొప్పునని ధీరులు చెప్పిరి శాస్త్రసమ్మతిన్.

25


గుర్రమున కొకసారి రెండుపిల్లలు పుట్టిన తక్షణమ యాగుర్రమును పిల్లలతోగూడ దేవతలకుగాని బ్రాహ్మణులకుగాని యివ్వదగును. కాని నిలుపరాదు.