పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తురంగవృత్తం.

ప్రాప్తనిర్మలైకవర్ణమై వెలుగుచున్న
యానెత్తి యుగ్రనాల యొక్కచాయయై తనర్చిన
దిప్తపుచ్చమది యధీశుని కౌతుకాదినిన్
సప్తజిహ్వగాన నిలుపజనదు కంపభూవరా.

17


చ.

మసక యొకింత లేక శశిమండలిమీద వినీలరోచులం
విసపుదై వినీలమణి నిచ్చినచాడ్పున వెల్లజాయతో
మసలిన మేనునం వెసను మస్తకముందన రారుచుండగా
త్రిసరియనంగదా బరగ ధీశ్వర సర్వధనాపహారియై.

18


క.

వుగ్రాక్షు డనగ దగు నిల
సుగ్రీపుని గళముబోలు గళము గలదది యలనీ
లగ్రీవనుహయ మ
త్యుగ్రంబై పతి ధణంబు యశమున రాచున్.

19


గీ.

మూడు కాళ్లును కడగిన ముసలి యగును
వెలయ నొకకాలు కడగిన విషమపాది
అదియు నదియును చాలదోషావహములు
అవిళతలమున తిలకంబు కలుగకున్న.

20


ముసలినిగూర్చి వెనుకటి యాశ్వాసములలో జెప్పినది చాలక మరల చెప్పుచున్నాడు. అవిళభాగమున తిలకమున్న దానిని మద్యమపక్షపువాజిగా నెన్నవచ్చును.


గీ.

పెక్కువన్నెల పులిభంగి బేర్చియున్న
అశ్వనామంబు పరికింప సవఘటంబు
కణగి యావాజి నేలక పుడమియెల్ల
వెడల నడపింపవలయు భూవిభుని కధిప.

21


పెద్దపులివలె మూడు నాలుగు వర్ణములు గలిగిన తురంగమును నవఘంబు అందురు. అట్టితురగంబును నిముషమైనను నిలువక వెడలగొట్టవలయును.