పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కూర్మితో నండయుగ్మంబు గలుగకున్న
హరుల గట్టంగజనదు మోహనమురారి.

11


చ.

అరయగ నేకపింగళి హయంబు నిజాధిపు ప్రాణవహ్ని ను
ద్దురగతి యుద్ధభూమి నతిదుర్దమసత్రునృపాల సాయకోలో
త్కరవరషంబుచే దనుపు గావున నత్తురగంబు నెందునుం
బురమున నుండనీజనదు పోడిమతోనున గోరువారికిన్.

12


చ.

పరగగ కేశవాలమున బాసి జనించిన దుష్టవాజినిన్
పరముగ నేలువాని ననపత్యుని జేయు కణంగి చూడగా
శిరమున ప్రోద్దకోశమున చెన్నగు శాశ్విత రోమజాతురుల్
కరము శితంబులైన తురగంబులు రాజుల గూల్చు నాజులన్.

13


తురంగవృత్తము.

కృష్ణవాలహయము చాలకీడు యుద్ధభూమిలో
ద్రిష్ణిదీర నరుల ద్రుంచి తెగు నధీశుతోడ దా
కృష్ణవర్త్మ యదరి యుగ్రకీల లెసగ నేర్చి యా
ముష్కతానిరూఢి దక్కి యుక్కడంబు చాడ్చునన్.

14


గీ.

హయము కృష్ణజిహ్వ యాజిరంగంబున
కరుగజేయు విభుని యధికయశము
ననుచు దెలిపి తజ్ఞులగువారు నిల్ప ర
వ్వాజి నెందు కంప వసుమతీశ.

15


నల్లనగు నాలుకగల తురంగము సమరమందు యజమానునియొక్క పూర్వయశము నశింపజేయునని హయలక్షణ త్తలు దానిని గొన నొల్లరు.


గీ

అరయ యేకవర్ణమై మేను మెరయంగ
వాలశిరము వొండువన్నెలైన
ఘోటకంబు కడగి ఘోరాజిలోపల
కర్త ప్రేతపురికి కానుకిచ్చు.

16