పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సరిచూడ మత్తవాధరములలో నొక్క
             యెడనాడి పొడవైన యదికరాళి
సమనుష్యద్వినాంకుశపంక్తిరీతిదం
             తాలు చెప్పడిన కరాళిదంతి
బరిపాటి నెడవెట్ట పండ్లది వచ్చిన
             హయమునామంబు దంతార్గళంబు
పండ్లన్నియును వచ్చి బలువైన యున్నచో
             మొసలిపం డ్లున్నది మూఢదంతి
అన్నిహయములు తమకులమెల్ల నణచి
పతుల గదలని పగరతో బరచియలచు
పుచ్చిపండ్లును నల్లనిపుప్పిపండ్లు
పరగు వాజులు తగవెందు కంపభూప.

9


మ.

అరయంగా హరియండయుగ్మము దానై దేండ్లునుందోవ పెం
దొరగింగాంచి రతిక్రియాకలన కుద్యోగింపకున్నేని న
త్తురగం బెన్నగ నింద్రియవృద్ధి యది దా దుష్టాత్మయై కర్త ని
ర్జరలోకంబువ కన్పిపుచ్చు తనవంశంబు సహాయంబుగన్.

10


సీ.

ఏకముష్కంబుల ధీశుని తత్తూని
             కాలునిపురికి వేగంబ యనుచు
వివిధవర్జాదులు వివిధాంధులును పతి
             పుత్రులనెల్ల దా సొలియజేయు
లలితోను లక్షితాండులు నిజనాథుని
             కౌతుకశ్రీనేల గలియజేయు
మార్జాలముష్కులు మర్కటాండులు తన
             జనపాలునకు పలాయనము దెచ్చు
జాతముష్కతురంగంబు జాతవేదు
కాహుతిగ జేయు తనునేలు నతనియిల్లు