పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చినను దిరిగినను కుక్క పిల్లి మున్నగు వానిదంతములవలె నున్నను యాగుర్రములను శాలయందు గట్టరాదు.


క.

పరికింప నల్లపండ్లకు
హరినామం బసితదంతినరుదగ గేవా
స్పురదురునానానంప
ధ్వరవిఘటనకారి గాన వల దది నిలుపన్.

5


గీ.

పంక్తి చక్కగాక పండ్లు లోన్కి వెలికి
పెరిగియున్న యదియు విషమదంతి
నిలువజనదు దాని నిలిపిన యౌగదా
పుత్రశోకవహ్ని పొగలజేయు.

6


పండ్లవరుస చక్కగా నుండక పండ్లు లోనికి పోయినట్లుగాని వెలికి వచ్చినట్లుగాని ముందునకు వెనుకకు బోయినదానిని విషమదంతి యందురు విసరదంతి విసమదంతి సమమగు దంతములు లేనిది. అట్టిగుర్రము నిలిపినవానికి పుత్రశోకము కలుగును.


గీ.

శునకదంతి యనగ సొరిదిగా జిప్పలు
పెట్టినట్టిపండ్లు పెరిగియున్న
హరుమునామధేయ మధిపతినాకవి
నీరువట్టుచేత వెరుగుపరచు.

7


గీ.

మిత్రభయము సకలశత్రువృద్ధియు జేయు
హీనదంతము కుదమైనవాజి
నీయధికదంతియైన యావాజి ప్రజలతో
విభుని ననుపు జమునివీడు చూడ.

8


తక్కుపండ్లు కలిగినహయము మిత్రులవలన భయమును శత్రువులవలన పీడయు నెక్కువ జేయును ఎక్కువపండ్లు కలిగినతురంగము ప్రభువును యాతనిప్రజలను యముని చూచుటకై పంపును.