పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధరప్రోధమోహనంబును దీప్తపుచ్ఛంబును దీప్తపుచ్ఛంబులును
తినునీల గ్రేచవపుంసకులు ప్రేతోపనీతగంధంబులును అవఖం
డంబులును రసాలమార్జాలపాదులును దగ్ధచమోపనీతబంధులు
ను కందుకనేత్రలలాటలిప్తజిహ్వవేదులును గరళంబువీకేశరులును
దోషనప్తవ్యస్ధివంశభంగులును కేశనాలంబులతోడం రాశి జనిం
చినవియును దివాజాతంబును అమలయి పుట్టినవియును నెక్కొక
గర్భంబు ననేకవారంబున జన్మించినవియును మహాదోషంబులయ్యె
తల్లక్షణంబులు తత్ఫలంబులు వివరించెద. అందు దంతదోషంబు
లెట్టివనిన.

3


విషమశుక్తిదంతలును కరాళిరూఢకలితదంతులును కుక్క పందిపిల్ల మున్నగు వికారజంతువుల బోలినపండ్లు కలవియును.


సీ.

సులపులై నందిజ్ఞ జొంపల నడగొరికిన
             పసదప్పి యెడపండ్లపగిది నున్న
లెక్కకు దరిగిన యెక్కువై యున్నను
             చిప్పలబాగున వొప్పకున్న
మొదళ్ళ వేరొండు మొలచిన విలిగిన
             పదివచ్చిపంతనే నమువబడిన
పారమేయబిడాలచజలదంతంబులు
             కెనయైనబాగున మొనసియున్న
యట్టిపండ్లున్న వాజుల కట్టరాదు
భవ్యచారిత్ర సలలితపద్మనేత్ర
శత్రునిర్భరరాయ వేశ్యాభుజంగ
రాజకులదీపయోభవ రాజకంప.

4


లెక్కింపగా తక్కువయైయున్నను ఎక్కువయైయున్నను చిప్పలవలె నుండకున్నను దంతముల మొదళ్ళను యింకొకదంతము మొల