పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జరమున భాతి వానరము జూడ మయూరములాగునన్ మనో
హరగతి నొప్పుతేజి విజయప్రదమౌ భళ కంపభూవరా.

76


గంధలక్షణము


శరభమువలెను పెద్దపులివలెను ఆవు యెద్దు సింహమువలెను రాజహంసవలెను ఒంటెవలెను ఏనుగవలెనురు కోతివలెను నెమలివలెను మనోహరరూపము కలదైయుండు గుర్రము విజయప్రదము.


ఉ.

ఆననభాగమందు నయనాబ్జయుగంబున నాసికంబునన్
వీనుల మేనిపై జెమట నీళ్బును మూత్రపురీషజాతియన్
రేనియనాఖ్య దుగ్ధకమదేభమదాంబితపుష్పగంధముల్
పూనినదానిసౌఖ్య మగు భూస్థలి నౌభళ కంపభూవరా.

77


ముఖంబునను నేత్రములయందును ముక్కునను వీనులందునను శరీరమునందునను పుట్టిన చెమటనీళ్ళును.


ఆ.

మత్స్యమథకకూర్మి మానుగశలభోరు
ఖరవరాహశునకగంధమైన
హరులు చుట్టలు... యసయంగ నౌభళి
ప్రభునితనయ కంపరాజతిలక.

78


మూడవపాదంబున గొంతభాగమున సమునర్ధస్ఫురింపజేయు క్రియాపదము పోవుటచే యర్ధము దోచదు


శా.

వేణుక్రౌంచ మృదంగదుంధిభిలసద్వేవేంద్రనాగోల్లస
ద్వీణావారిదమంజునాదములకుం బ్రియ్యంబులై యొప్ప
నిక్వాణంబుల్ గలవాజి యిచ్చు పతికిన్ కళ్యాణముల్ క్పరనా
క్షోణీపాలక సుప్రతాపశుభముల్ స్తోత్త్రైకపాత్రంబులన్.

79


వేణువు క్రౌంచము మృదంగము దుందుభి స్వర్గలోకసంబంధితమైన వీణ మేఘము మున్నగువానియొక్క సుశబ్దముల ననుకర్ణించురవముగల తురంగము యజమానునకు సకలకల్యాణముల నొసంగును.