పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అమరంగ తద్దేశమంగళంబులు రెండు
             నోష్టలోచనములు యొనరునట్లు
ఆననంబగు ముప్పదంగుళములు యుండు....

34


పద్యము పూర్తిగా లభింపలేదు.


చ.

కడగి ఖురాగ్ర మాదిగను కాకసదేశముదాక గొల్వగా
పొడవు శతాంగుళంబునయి పొల్బుగ నుత్తరుమైన సప్తికిన్
నడుమున జూప మధ్యమగు వాజికి దొంబదియంగుళంబు లై
యదయగ నీచయశ్వమున కంగుళసంఖ్య యెనంబదై చనున్.

35


చ.

హరులప్రపానపాళి మొదలై తగువర్తిక గాక చూడ నూ
రిరువదియంగళంబు లగు నెక్కడ మధ్యము నంతకంటె ని
........................................................................ ని
ట్లరువదియంగుళంబు లగు నయ్యది శ్రేష్టము కంపభూవరా.

36


క.

పొడవునకు తగిన నిడుపును
నిడుపునకున్ దగినవలము నేడది గూడం
గడునొప్పు లక్షణంబులు
యడరినయది యశ్వరత్న మది గంపనృపా

37


క.

వదనంబునకును వర్తిక
సదృశమై యుండవలయు జఘనంబున కొ
ప్పిదమై వరపుర కెనయౌ
పొదలగవలె హరికి గంపభూపాలమణీ.

38

ఇతి ప్రమాణనిర్ణయః

వ.

ఇంక వయోజ్ఞానం బెట్టిదనిన.

39


ప్రమాణలక్షణ మెఱిఁగించిన పిమ్మట వయఃపరిణామములు జెప్పెదను.