పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

అశ్వలక్షణసారము

తృతీయాంకురము



కరకటాక్షవిజయ
శ్రీకాంతా కృష్ణరాయ సిద్ధకృపాణా
స్వేకృత సత్వరపర
భీకరభటయూధకంప పృథ్వీనాథా.

1


కృతిపతికి సంబోధనము.


క.

వివరించి దశాక్షేత్రము
ల విభాగము లొనర చెప్పెదను నేరుపునన్
చెవి జేర్చి వినుము మనమున
తవరింపగ నిది సుమి ప్రభాపథములు రెండున్.

2


దశయన నెద్దియో క్షేత్రమున నెద్దియో బాగుగా బోధపడునల్లుగా చెప్పెదను, శ్రద్ధాళుఁడవై యాలింపుమని మనుమంచిభట్టు కృతిపతి నుద్దేశించి చెప్పుచున్నాడు.


సీ.

అశ్వంబునకు పరమాయుఃప్రమాణంబు
             వదలు ముప్పదిరెండు వత్సరములు
పరమాయు వందులో పదియవభాగంబు
             తనరారు నొకదశ యనఁగఁ బరగు