పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గుర్రముయొక్క ముక్కుక్రిందను మూడు సుళ్లుండిన యెడల దాపలిసుడి రౌతుయొక్క జనకుని వెలుపలిసుడి రౌతు యొక్క సోదరుని మధ్యసుడి రౌతును సంహరించును.


క.

పెదవులసుళ్ళు హయం బే
విధమున నిజభర్తసౌఖ్యవిభవము లెల్లన్
నిధుబింబము నలరాహువు
విధమున నది మ్రింగు దనకు వ్రగ్గైనయెడన్.

56


రెండు పెదవులందును సుళ్ళుండరాదు. ఉన్న యెడల రౌతుయొక్క సిరిసంపదలను చంద్రుని రాహువు కబలించురీతిని గబళించును.


క.

కందము సుడిగలతురగము
నిందింతురు తురగశాస్త్రనిపుణులు దానిన్
డెందమును భీతి గల్గిన
ముందర మనువారు వాజి మొన నెక్కుదురే.

57


మూపున సుడిగలతురగమును హయలక్షణవిదులైనవారలు గొననిచ్చగింపరు.


క.

భావకులు వినుదుతురగము
గ్రీవావర్తంబు మిగుల గీడై భువిలో
నేవిధమున నారోహకు
జీవంబున తిరుగనీదు సిద్ధంబు హరీ.

58


గీవావర్తమను సుడిగలతురగము రౌతునకు హానిసేయుచు పెక్కుదినము లాతని భూమిలో నిలువనీయదు.


క.

మన్యావర్త తురంగము
విన్యాసము భర్తవంశవిభుప్రాణముపై
అన్యాయము తలచుట గుణ
ధన్యాత్ములు దాని నెక్కదగగొన రెందున్.

59