పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ముకుదూలంబున నడుమున
ప్రకటితముగ రోమజంబుపాలిట్లిన ఘో
టకము విభుమృత్యుదూతని
సకలతురంగజ్ఞులెల్ల చదివిరి మొదలన్.

52


ముక్కుదూలము యొక్క మధ్యను సుడియున్న తురంగము మృత్యుదేవతయొక్క దూతయని దలచి హయలక్షణవేత్తలు బలుకుదురు.


ఘనమగు దారిద్ర్యంబున
మునగగ నెదగోరునట్టి మూఢుడు గొనుచో
హనుజములు కొనుచునాహము
ననుపమమగు నారాయ మీనలాంఛితకంపా.

53


దవడలయందు రోమములుగల తురగమును దరిద్రముగోరుకొనువాడు దక్క నితరుడెవ్వడును కొనడు. మిక్కిలి దారిద్ర్య మొనగూర్చును.


క.

కరగంబు మీదిపెదవిన్
నిరతముగా రోమజంబు నిజమగుతల్లిన్
సురరాజు జూడననుపును
చిరకాలంబుండనీదుసిద్ధం బధిపా.

54


తురగముయొక్క మీదిపెదవిపై సుడియున్న యెడల రౌతుయొక్కతల్లిని స్వర్గమున కంపును.


క.

పొలియంచు వాజిప్రోధ
స్థలికిందటి మూడురోమజంబులలో
పలిసుడి పతిజనకునివల
పలిపతియన్న గనుమధ్యభాగము పతియున్.

55