పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

................తత్ప్రమాణంబులు సుళ్ళయొక్క ప్రమాణంబుల చెప్పుచున్నాడు.


సీ.

అంగుళత్రయమున నవలీఢకము నిల్చు
             రెండంగుళంబుల నుండు శక్తి
చతురంగుళంబుల శతపాది పరినాటి
             పాటించు నంతన పాదుకయును
ముకుళంబు సుడియును మోబునంగుళ చతు
             ర్భాగంబునందు త్రిభాగముగను
పాదుకార్ధము హీనపాదాంగుళంబున
             మూకమష్టాంగుళమున దనర్చు
నిట్లు చెప్పిన వాటిని నెల్ల సుళ్లు
నిలిచెనేనియు దమతమ ఫలము నిచ్చు
నట్లు కాకుండ నం దల్ప మధికమైన
చండభుజబల మీసరి గండకంప.

7


వ.

ఇట్లు వివరించిన యెనిమిది దెరంగుల సుళ్ళులోపల శుభాశుభవర్తంబులు పరికించునెడ నావర్తంబులు ముకుసంబులు శుక్తులు శుభంబులు ప్రధానంబులై యుండు. తదావర్తంబులు వాహంబులకు కొన్ని శుభంబులు కొన్ని యశుభంబులు నన రెండు దెరంగులై యుండు నని ధృవావర్తంబులు పదియును పదినెలం బాయకుండు నాగంతుకంబులయిన శుభాశుభవర్తంబులు నూటపదమూటిలోన ముప్పదియేడు శుభంబులను దెబ్బదియారు యశుభంబులును
ననబరగుచుండు తత్పలంబులు తన్నివాసంబులు ధృవంబుల కధిదేవతలకు గ్రమంబున వివరించెదను.

8


పైన వివరింపబడిన యెనిమిది విధంబులైన సుళ్ళలోనును శుభాశుభములను గనుగొనునప్పుడు ఆవర్తము. ముకుళము శుక్తి శుభ