పుట:అరుణరేఖలు-తెన్నేటి సూరి-1954.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరుణరేఖ

తరుణారుణ ప్రభా

తరళతరేఖను నేను

తొలిసంజ ప్రొద్దులో

వెలుగు లందించాను... త.


అంధకారముచీరి,

అవతరించాను.

శిఖిరేఖనై దిశల

జేవురించాను... త.


చిమ్మచీకటిదొరల

చీల్చివేశాను,

దండులేకే వెడలి,

దాడిచేశాను... త.


మృతజీవులెల్లారు

బ్రతుకజేశాను,

చైతన్యమూర్తివై

జీవమిచ్చాను... త.