Jump to content

పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగు మొబైల్ యాపులూ వికీ వ్యాసరచనల పోటీ వికీపీడియాలో వ్యాసాలు: నాలుగు లక్షల రూపాయల బహుమతులు తెలుగులో- తెలుగు నుడి (భాష) గురించి, తెలుగు చరిత్ర గురించి, తెలుగు సంస్కృతి గురించిన నాణ్యమైన సమాచారం అందరికీ అందుబాటులో లేదు. వలగూడు (అంతర్జాలం) వేదికగా అందుబాటులో ఉన్న తెలుగు వికీపీడియాను ఒక ప్రాతిపదికగా తీసుకుంటే పై అంశాల గురించి నాణ్యమైన ఒక వెయ్యి వ్యాసాలు కూడా ఉండవు. మన తెలుగు వారి జనాభా తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల బయట కలిపి 18 కోట్లు ఉంటే, కనీసం 18 మంది కూడా ఈ విషయమై చూపు సారించి తెలుగు వికీపీడియా లాంటి వనరుల్లో చురుగ్గా పనిచేయటం లేదు. ఏడాదికి కొన్ని పరిశోధనా పత్రాలు వెలువడుతున్నా, అవి ఏదో ఒక గ్రంథాలయ సొరుగులోకో, వెయ్యికి దాటని ప్రచురణగానో మిగిలిపోతున్నాయి. ఈ వెలితిని నింపుతూ, కొంతలో కొంత తెలుగు నుడి, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి అంశాల్లో సమాచారం వలగూడులో చేర్చే దిశగా తెలుగు భాషోద్యమ సమాఖ్య వ్యాసరచన పోటీని నడుపుతున్నది. నేడు వలగూడు అనేది సమాచారాన్ని పుట్టించటానికీ వాడుకకూ భద్రపరచటానికీ ఉన్న అతి పెద్ద వనరుగా మనముందుంది. వలగూడులో చేర్చని వ్యాసం ఎక్కువ మంది చదువరులకు చేరదు కూడా. అందరికీ అందుబాటులో ఉండే విధంగా అంశాలను చెప్పాలంటే వలగూడే అందరికీ అందుబాటులోనికి తెచ్చే సాధనం. వ్యాసరచన పోటీకి అంశాలు: 1. తెలుగు నుడి: తెలుగు నుడి పుట్టుక, వికాసం, మాండలికాలు, యాసలూ, లిపి, లేఖనం, రచనాసంప్రదాయం, వ్యాకరణం, భాషాశాస్త్ర అనువర్తనాలు, పనిముట్లు గురించి రాయవచ్చు. 2 . తెలుగు వారి చరిత్ర, తెలుగు నేల చరిత్ర: తెలుగు వారి గురించీ తెలుగు నేల గురించిన చరిత్రకు ఆధారమైన ప్రతి అంశమూ. తెలుగువారి ప్రాచీన నాగరికతలూ, శాసనాలూ, రాగిరేకులూ, తాళపత్రాలు ఇతరత్రా చరిత్ర ఆనుపానులు. 3. తెలుగు సంస్కృతి: తెలుగు సమాజం, జన జీవన స్రవంతి, సామాజిక చైతన్యం, సంస్కరణలు, మన కట్టూబొట్టూ, గుడులూ గోపురాలూ, ప్రార్థనామందిరాలూ, చెరువులూ బావులూ, పశువులూ సేద్యం, పాడీ పంటలూ, మందులూ మాకులూ, వంటా వార్పూ, తిండీ తిప్పలూ, నమ్మకాలూ మన్నింపులూ, పెండ్లిళ్ళూ పేరంటాలూ, పండుగలూ సంబరాలూ, జానపద, గిరిజన విజ్ఞానం, కథలూ కథనాలూ, ఆటలూ పాటలూ, నాటికలూ నాటకాలూ, సినిమాలూ బుల్లితెర విన్యాసాలూ ఇంకా ఇలాంటివి ఏవైనా కావొచ్చు. 4. ఇంకా నేటి, రేపటి తరం తెలుగింటి పిల్లలను తెలుగు నుడి వైపుకు ఆకట్టుకొనే వ్యాసం ఏదైనా రాసి పంపవచ్చు. పై అంశాల మీద ఇంతకు ముందు ఎక్కడా ప్రచురించబడని, కొత్త, సరికొత్త వ్యాసాలే పంపండి. అందిన మొత్తం వ్యాసాలలో 100 మేటి వ్యాసాలను ఎంపిక చేసి ఒక్కొక్క వ్యాసానికి అక్షరాలా వెయ్యి రూపాయల నగదు బహుమతి అందిస్తాం. మొబైల్ యాపులు: గడచిన పదేళ్లుగా మనలో ప్రతి ఒక్కరి చేతికీ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి. అయితే అందులో తెలుగెంత? మన తెలుగు జనాభాలో పూర్తిగా ఆంగ్లంలో నూటికి పది మంది వ్యవహరించగలిగితే, మరో 20 మంది తొలిమెట్టు ఆంగ్లంలో వ్యవహరించగలరేమో! అంటే దాదాపు నూటికి 75 మంది వచ్చీ రాని ఆంగ్లంతో మొబైల్ ఫోనులను వాడుతున్నారు. అంతరవర్తిని (ఇంటర్ఫేస్) స్థాయి వరకూ, పేర్లను దాచుకునే వరకూ తెలుగు ఉన్నా చాలా అనువర్తనాలు (యాపులు/Mobile apps) నేటికీ కేవలం ఆంగ్లంలోనే ఉన్నాయి. కానీ తెలుగులో అనువర్తనాలు తయారు చేసుకునేందుకు సాంకేతికంగా నేడు ఎలాంటి అడ్డంకీ లేదు. అంటే తెలుగు వారి పట్టనితనం వలననే తెలుగులో మొబైల్ యాపులు రావటం లేదు. అందుకని తెలుగు భాషోద్యమ సమాఖ్య తెలుగు మొబైల్ యాపు నిపుణులకు తెలుగులో మొబైల్ యాపులు రూపొందించమని పిలుపునిస్తూ, మొబైల్ యాపు పోటీని నడుపుతున్నాం. ఈ మొబైల్ యాపు పోటీలో ఎలాంటి యాపులు రూపొందించవచ్చు?

  • తెలుగు నుడి నేర్చుకోడానికి ఉపయోగపడే యాపులు
  • ఈ తరం పిల్లలు తెలుగు సాహిత్యాన్ని గురించి మక్కువతో తెలుసుకునేలా చేసే సాహిత్య ప్రధానమైన యావులు
  • తెలుగు శుభలేఖలు, ఆహ్వానపత్రాలు, సభలకు, వేదికలకు తెరలు, తయారు చేసుకునే యాపులు

ఓ తెలుగు ఆటలూ, తెలుగు మాటలతో ఆటలు మున్నగునవి.

  • నేటి, రేపటి తరం తెలుగింటి పిల్లలను తెలుగు నుడి వైపుకు ఆకట్టుకొనే యాపు ఏదైనా కొత్తగా తయారు చేసి పంపవచ్చు.
  • సృజనాత్మకంగా తయారు చేసి, తెలుగే కనిపించే యావులు పంపండి

ఎంపికైన యాపులకు 3 లక్షల రూపాయలు నగదు బహుమతులను అందజేస్తాము. మరిన్ని వివరాలను, వ్యాసరచన పోటీ కట్టుబాట్లను https://telugubhashodyamasamakhya.blogspot.com వద్ద చూడగలరు. తెలుగు భాషోద్యమ సమాఖ్య e-mail: tebhasapoti@gmail.com