Jump to content

పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగిక'ను గూర్చిన వివరణ కొంత విశ్లేషించాలి. ఇది తొలి తెలుగు ముద్రిత వ్యాకరణం. తెలుగు నేర్చుకునే పాశ్చాత్యుల కోసం రచించిన వ్యాకరణ గ్రంథం ఇది. ఇది 1728వ సం. మద్రాసులో అచ్చయింది. జర్మన్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ప్రధాన నగరమైన హాలె ప్రస్తుతం సాలె(saale) అంటారు. 35వ వార్షికోత్సవ సందర్భంగా 1984లో పునర్ముద్రించారు. 199 పుటలున్న ఈ గ్రంథానికి పీఠిక, అభిప్రాయం కలపి 202 పుటలతో పునర్ముద్రణ అయింది. మార్టిన్ లూథర్ విశ్వవిద్యాలయం, హాలె-విటెన్ బర్గ్ వారి సహకారంతో పునర్ముద్రణ జరిగింది Legacy అనే పేర ముద్రించిన నాలుగు పుటల పీఠికలో ఎన్నో చారిత్రిక, సాంస్కృతిక, వారసత్వ, విజ్ఞాన విషయాలున్నాయి. షూల్జ్కి పూర్వం భారతదేశం వచ్చిన బర్తలోమయి జిగెన్బాగ్ కి సంబంధించిన అపురూపమైన వివరాలు సంక్షిప్తంగా అందించాడు. 'గ్రమిటిక తెలుగిక' అనే ఈ వ్యాకరణ గ్రంథం ఒక వైపు లాటిన్ మరోవైపు తెలుగు భాషల్లో ముద్రితమయింది. ఇందులో మొత్తం ఎనిమిది విభాగాలు ఒక అనుబంధం ఉంది. ఎనిమిది విభాగాలు 1. లిపి (Script) 2. ఉచ్చారణ (Pronounciation) 3. నామవాచకాలు (Nours) 4. విశేషణాలు (Adjectives) 5. సర్వనామాలు (Pronouns) 6. క్రియలు (Verbs) 7. ప్రత్యయములు (Particles) 8. వాక్యనిర్మాణాలు(Syntax) అని వర్గీకరణం చేశాడు. అనుబంధంలో విశ్వాసం యొక్క మంత్రము, పరమండల మంత్రము, ఆదికాండం genesis మొదటి అధ్యాయం ఉన్నాయి. ఆనాటి వ్యావహారిక భాష, పదాల పలుకుబడి, రచనావిధానం ప్రత్యేకంగా గమనించవచ్చు.

(తరువాయి వచ్చే సంచికలో...)

కవిత

“బాపట్ల నానీలు”

నాటి మా టీచర్లు.
అమ్మ మనసులు
ఆ జ్ఞానబీజాలే
ఈ అక్షర ఫలాలు

అమ్మ వుత్తరంలో
మనసుతడి
ఆ ఒడి కోసం
బతుకంతా వేసవి మడి

ఎడ్లబండి రిక్షాలు
ఆనంద కాసారం
కార్లు వచ్చాక
ఊరు కాలుష్యాగారం

మా నాన్న
నల్లకోటు పావురం
ఎగిరిన ఆకాశమంతా
మానవత్వం

బతుకంతా వలసే
నడిచింది.
ముత్యాలకోసమైనా
దొరికింది గవ్వలే

నేను విస్తరించింది.
నగరంలోనే
నా వేళ్లు మాత్రం
మా వూరివైపే

గీతాజయంతులు
మా నాన్న జీవనవ్రతం
ఫలశ్రుతులు
మా జీవితాలే !

సముద్రంలో నీళ్ళన్నీ
బడబాగ్నిని ఆర్పలేవు.
వేదనాగ్నిని
కన్నీటిలా

- సి. భవానీ దేవి 98668 47000