Jump to content

పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రజలనోళ్ళలో నలిగిన కధలకు పాటలకు ఎన్నో వన్నెలు చిన్నెలు వస్తాయి. అచ్చులోవలె బిగుసుకు పోవు.సెలయేరులా ప్రవహిస్తుంటాయి.

అరిగిపోయిన వస్తువు కొత్త వ్యూహాలతో ఉద్యమాలు

'ప్రత్యామ్నాయం'లో మెప్పు పొందిన 'యాసగాలి' కధలో జీడి కార్మికులు, తమ గ్రామానికి ఏవో పథకాలు మంజూరు చేయటానికి కలెక్టరు వస్తున్నాడని తెలిసి, సహాయ నిరాకరణ చేద్దామనుకుంటారు. యం.డి.వో కలిగించుకుని అరెస్టైన వాళ్ళ నాయకులను విడిపించి కలెక్టరుతో చర్చలకు ఒప్పిస్తుంది. యమ్డివో ప్రభావం పెరుగుతున్నందుకు మండిపడే నాయకులు ఆమెను బదిలీ చేయిస్తారు. నక్సలైట్లు సినిమా హాలు పేలుస్తారు. కానీ ఈ కధ వచ్చిన రెండేళ్ళ కంటే ముందు, శ్రీకాకుళం జిల్లాలో ఆర్డివోగా, పీవో గా పనిచేసిన, శ్రీ డి. రామకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా వచ్చారు. అక్కడ గిరిజనుల భూపోరాటం రాజుకుంటుంది. కలెక్టరు పోలవరం మండలంలో మనగోపల గ్రామానికి వెళ్లారు. ఆయన స్కీములు గూర్చి చెప్పింది విని, మా భూముల సంగతి ఏమిటి అని గిరిజనులు అడిగారు. ఏంచేద్దాం? అని ఆయన ఎదురు ప్రశ్న వేసాడు. భూమి హక్కుల మీద మాకు అనుమానాలున్నాయి. రికార్డు కాపీ చేసుకుంటాం, యమ్మార్వోకు చెప్పండి. రాసుకోండి అని ఆదేశించాడు. ఊళ్లో 400 ఎకరాల్లో 50 ఎకరాలకే రైతులకు పట్టాలున్నాయని తెలుసుకున్నారు. మిగతా పొలాలు తమకు పంచమంటూ స్కిములు వద్దు-భూములు కావాలి అంటూ ఉద్యమం ప్రారంభించారు. మరో కధ 'కొలతలు'లో చాల ప్పడికి పట్టా ఇచ్చారు. చేసుకుంటున్నాడు. ఆ భూమి మీద కన్నేసిన వాడు, హైకోర్టు పోయి స్టే తెచ్చాడు అంటాడు రచయిత. మరేం చేస్తాం అంటాడు. కలెక్టరు. స్టే అంటే యధా తధ పరిస్థితి. పొలంలో దున్నే వాడే ఉన్నాడు కాబట్టి ఇటువంటి స్టే నిరుపయోగం అని పశ్చిమగోదావరి జిల్లెళ్లగూడెంలో

అప్పగించిన భూమి వదిలేది లేదు అని కలెక్టరుకు తెగేసి చెప్పారు. అలాగే భూపోరాటంలో పాల్గొంటున్న తమవాళ్ళను

పోలీసులు తీసుకుపోతే గిరిజనులు పశ్చిమ గోదావరి, ఖమ్మంలలో అధికారులను నిర్బంధించి; DGP గా ఉన్న శ్రీకాకుళం బిడ్డ హె.జె. దొర సాక్షిగా విడిపించుకుంటూ 'ప్రత్యామ్నాయ' వ్యూహాలు పన్నుతుంటే; మండలాధ్యక్షుడిని కిడ్నాప్ చేసి నక్సలైట్లను విడిచి పెట్టమనే పాత ఎత్తుగడలనే జీవన స్రవంతి 'కథ'లో అరగరాస్తాడు. మల్లిపురం జగదీశ్ సింజిడి' కధలో (వేగావతి కధలు) గిరిజనుల భూములు కొనరాదు. కాని 99 ఏళ్ళు కౌలు రాయించుకుంటున్నారు అంటాడు. కౌలు కూడా చట్టవిరుద్ధమే.' గోరపిట్ట కథలో గిరిజనులకు వివాహ చట్టం వర్తించదు. కాబట్టి కోర్టు విడాకులు ఇవ్వలేవు. అంటాడు. మరో పాత్ర కోర్టుఎందుకు? కులం పధ్ధతి ప్రకారం పోదాం అని మంచి సలహా ఇస్తుంది. అయితే గిరిజనులు కూడా మొండితనానికి, మోసానికి అలవాటు పడ్డారు. ఒక గిరిజనమహిళ మగనాలి పోతుంది. ఈ రెండో మొగుడు పిల్లలను కన్నాడు. కాని చూడడు. పెద్దలు చెప్పినా వినడు. ఆమె భరణంకోసం కోర్టుకెక్కింది. ఆమెకు ముందు మొగుడితో వివాహం, విడిపోవటం చట్టబద్ధంగా జరగలేదని, మొగుడు ప్లీడర్ ను పెట్టుకుని వాదిస్తాడు. గిరిజన సంప్రదాయాలను పేర్కొంటూ భరణం ఇవ్వవలసిందే నని రంపచోడవరం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ తీర్పు చెపుతాడు. కాబట్టి చట్టం, వ్యవహారం తో ముడిపడిన వస్తువు తీసుకున్నప్పుడు అందుకు సంబంధించిన జ్ఞానం ఉండాలి.

ఆదిలాబాద్ అడవులనుండి రాస్తున్న గిరిజనాభివృద్ధి సంస్థ ఉపాధ్యాయుడు వసంతరావు దేశపాండే, కలెక్టరు భూములు సర్వే చేయిస్తున్నాడని, ఉమ్మడి అటవీ యాజమాన్యం పథకంకింద అడవిని గిరిజనులు పెంచుతున్నారని, నగరం నుండి వచ్చిన వైద్యవిద్యార్థులు గిరిజనులకు పిటిషన్లు రాసి సాయపడు తున్నారని 'విపుల' 'చతుర' లలో 'ఊరు', 'ఫాస్ట్ ఫార్వర్డ్' నవలలు రాసాడు. అంతకు ముందు 'అడవిలో వెన్నెల'లో కధలనే 'అడవి' నవలగా రాసి ఆయన వెలుగులోకి వచ్చాడు. ఈయన తరువాతి నవలలు, ITDA ల ప్రచారానికి బాగా పనికొస్తాయి. 'అడవి'లో సమస్యలు పటాపంచలైనాయి అనే భ్రమను కలిగిస్తాడు. ఈ నవలల సంకలనానికి 'కొమరం భీం ఫేం' అల్లం రాజయ్య ముందు మాట రాసారు. ఇవి ఇతర భాషలలోకి అనువాద మయ్యాయిటగాని, ఆ కలెక్టర్, భూముల పంపకం విధి విధానాల మీద, ఆంగ్లంలో రాసుకున్న రిపోర్టును తనుగాని, 'ఉద్యమాలనుండి నుండి ఉద్యమాల దాక' అని థీసిస్ రాసిన గిరిజన సంక్షేమశాఖ అధికారికిగాని, తెలుగు చేసి జనానికివ్వాలని పించలేదు. ('నడుస్తున్న చరిత్ర' ఆ అనువాదం 'దున్నేవాడికి భూమి, భూమిలోకి దున్నేవాడు' 2007 లో ప్రచురించింది).

(తరువాయి వచ్చే సంచికలో...)