పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సోలువు సోలువుగా వరస 'పెట్టిందారు.

సంతంతా గుమ్మడికాయలు, సొరకాయలు, పళ్లకాయలు, వీరకాయులు, కాళకతరకాయులు, చిక్మ్కుదుకాయులు, గోరుచిక్కుడుకాయలు, కారామణి, పీంచకాయలు (బీన్స్‌), దబుల్‌ వీన్సు, క్యారేటు, వీటురూటు, వుర్లగడ్డలు, నవకోలు, ముల్లంగి గడ్డలు, మునగకాయలు మెరస్తా వుందాయి. నల్ల తెల్ల గుండు, పొడవు, సప్రము వంళకాయలు. బట్టి, బోందా, బుద్ద, మూన్నెల్ల, ఆర్నెల్ల మిరపకాయలు. కోసు, పువ్వకోసు, పచ్చి బటాణి, తమాటాలు, బెండకాయలు, తొాందకాయలు రాసులు ఠాసులు పోసిందారు.

సొంటి, అల్లము, గెణసగడ్డలు, ఏళికాయలు, వెలక్మ్కాయలు, నిమ్మకాయలు, ఉద్దలు ఉడ్డలు పోసించారు.

దంటుకూరాకు, సొక్కెతాకు, సబ్బచ్చాకు, పాలాకు, మెంతము కూరాకు, సిలికిలాకు, పణగంటాకు, గురగాగు, కన్వాకు, కాశాక్సు, మునగాకు, పుదినా, కొత్తమీరి, కరివేపాకు కట్టలకు కాదవలేదు.

ఆ పక్కలానే జొన్నెన్నులు, చేపుకాయలు (జామ), సేవుకాయలు (ఆపిల్స్‌, దాలందరి (దానీమ్మ, పనస, పరంగి, మామిడి, తెల్ల, నల్ల వ్రాక్ష సపోట, తిత్తిలికాయలు (ఆరెంజ్‌), జేరికాయలు, కలంగరి (పుచ్చకాయ) కాయలు, సోలువు సోలువులుగా పేర్చి పెట్టిందారు.

“అడవిమల్లి సూదిమల్లి, గుండుమల్లి, జాజిమల్లి, మూడుచుట్ల మల్లి, ఏడుచుట్ల మల్లి, ఏ మల్లి కావాలన్నా ఒగేరేటు” కూస్తా వుండాడు పువ్వులన్న

“కనకబరాలు, రోజుపూలు, రుద్రాక్షపూలు, దాసాళం పూలు, గులావీ, చామంతి, చెలుమల్లి, బేదీపూలు, సంపంగి, సుగందర రాజులు, పన్నీరాకు, మంచితాలసి, అన్నీ వుంవాయి” అంటా కాసులు బాగా కమాయిస్తా (సంపాదిస్తా) వుంది పూలమ్మి.

నూగులనూనె, సెనగనూనె, ఆముదము, వేవనూనె, కానుగనూనె డబ్బాలకు కొదవలేదు.

సంతకి రవంత దూరంలా ఎండిదే చేపలు, రవ్విలు, నాటుకోడిగుర్లు పారం కోడిగుడ్లు, నాటుకోళ్లు, గొర్రెలు, మేకల వ్యాపారాలు జోరుగా సాగతావుందాయి.

బోందాలు, వడలు, పుట్టు, బజ్జీల గమ్ములు ముక్కులాకి ఎక్కి ఎబుడెబుడు తిందామా అనే ఎన్నాన్ని (మనసు) పుట్టుబడి చేస్తా వుంచాయి.

ఎలనీరు (కాబ్బరిబొండాం), తాటినుంగులు జనాల దప్పి తీరస్తా వుంటే, ఇంకొందరు జనాలు దోసకాయకి కారము పూసుకొని తినీ మింగి మైమరస్తా వుండారు.

నేనూ వూరికే వుంటానా, కావలసింది తినీ, కదగా మజ్జిగ తాగి మామిడికాయ ఊరగాయ నంజుకుంటిని.

“సింతలేని సితరంగి సంతకి ఒగ బిడ్డని కన్నెంట. అట్లా ముండ అది. దాని మాటల్ని నువ్వు కట్టుకొంటావా? (వింటావా), ఏల ఏడస్తావు కలకుండుమా” పేదరాలు పెద్దమ్మ చిన్నమ్మని సుదారిస్తా వుంది.

“దానీ పుట్టు చూస్తే పురొస్తుంది, వాకిలి చూస్తే వాంతికి వస్తుంది. దానికి నీ సుద్ది ఏమిటికంటా” వేమిరెడ్డి మల్లమ్మ రేగతా వుంది.

| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ మార్చి-2021 |

“అంతా నా కర్మక్కా కంతకి తగిన బొంతలా నా మొగుడు ముద్దలు మింగి (తిని) పనుకొంటాదే కాని నా గురించి ఒగ మాటా మాట్లాడేలే” అంటా మీనమ్మ .

“ఎదురుయాజ్యానికి వెనగుండాలా. బంతిబోజనానికి ముందుండాల, అనేది పెద్దోళ్ల మాట. కొన్నాళ్లు సరుసుకొనిపోమ్మా నీకూ మంచికాలము వస్తుంది” దైర్యము చెప్పతా దేవమ్మ.

“ఈకిత కర్చులు పోయి మిగిలింది పదివేలే. కొడుకుని కాలేజికి చేర్చాల, ఏమి చేసేదో వమో వెత పడకా వ్యవసాయి (రైతు).

“ఈపఫొద్దే కాసులు కట్టిదాల, లేదంటే సీటు చిక్మేలేదు” దాక్టరు కోర్సుకు కొడుకుని చేర్చతా వ్యాపారి.

రైతు వెతలే కాదు వ్యాపారి కిక్కు కతలూ ఈడ చానా కనీపిస్తాయి, వినీపిస్తాయి.

“అబ్బా పరంగిపండు(బొప్పాయి) మాదిరిగా వుందిరా” పదుచును చూస్తా పిల్లగాడు అనె.

“పండు పైన పొట్టు వుంటుందిరా చూసి నదు, గొంతులా తగులుకొంటే చానా గాసిపదాలా” మంచిమాట చెప్పతా మల్లన్న

“దేశము తిరిగిన గువ్వ గూటికి రాకుండా పోతుందా, నువ్వ పదరా” అదేమి యవ్వారము నడివెనో మొకము ఎర్రగా అయిందే సత్తిగానీ బుజంమీంద చెయ్యేసి పిట్టన్న పోతావుందాడు.

ఈసంత మాసంత సరుకుల సంతే కాదు. సంసారాలని నిలబెట్టే సంత. చింతల్ని తుడిపి మనషుల్ని మంచిగా మార్చి. తన గుండెల్లో పెట్టుకొని గూడుకట్టుకానే సంత. సంత సమాచారము తెలుసుకొాంటా నేను. సరకుల బేరములా అబ్బా అమ్మ.

పొద్దయిపోతా వుంది. పొద్దప్పని చూస్తా జనం సంతను విడచి చిన్న చిన్న దోవలుగా మారి మబ్బు ముసురుకొంటా వుందనంగా ఇండ్లు చేరిరి.

న...

ఓసూరు పక్కలాని వూర్ణువూర్లంతా కొత్తబట్టల్లా కళకళలాదతా పిండివంటల్లా గుమగుమలాదతా వుందాంబ. పరసని చూసేకి పయనమవ్వతా వుండాయి.

అమ్మా అబ్బ, అవ్వాతాత, మామ, అత్త, మామకూతురు మల్లి, మా అమ్మ అంతా చేరి పరస దోవలా పోతావుండారు.

పొద్దప్పని కష్టంలా మేఘాలు పాలుపంచుకొని చల్లనిగాలిని నేలపై గుమ్మరిస్తా ఆదాడ నీదనీ పరస్తా వుండాయి.

“రామరామ ముకుంద మాధవ రామ సద్దురు కేళవా

రామ దళరథ తనయదేవా - రామశీ నారేయణ /రామా॥!

కంటకులు వారిని చూవమందురు - కాయమందే చూడరూ

అత్భమర్భము తెలియనేరరు - అమర శ్రీ నారేయణ” తాతగారి ఆశ్రమము నీంకా బజన పాట వినబదతా వుంది. పాట వినుకొంటా ముందరికి నడిస్తిమి.

దోవ పక్కలా చింతమాను నీడలా ఆదాయమ్మ డోలుని మెడకి తగలేసుకొని వాయిస్తా వుంటే మగోడు ఉరుమారెమ్మని తలమీద పెట్టుకొనీ ఆదతా నారపస్గ్ధము (కారడాతో కాట్టుకొంటా వుండాడు. అది చూసినవాళ్లంతా వాళ్లకి తోచిన కాసుల్ని ఆదవేసి పోతావుందారు.

ఆ పక్క్శలానే కొందరు కట్టిసాము చేస్తా కనిపిచ్చిరి. వాళ్ల కట్టెని బలే న్వాక్‌గా జోరుగా తిప్పతా వుందారు. “ఇందప్పా” అంటా రాయిని