పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెప్పిరి.

అందరూ చేరి వచ్చే ఏడాదికి కొత్తతేరు తయారు చేయాలని ముడువుకి వచ్చిరి.

బాగలూరు తేరుమాదిరిగానే మా తావుల్లా చానా తేర్తు కిందనీంకా మిందగంటా పూర్తిగా మానుల్లా తయారు చేసిందే తేర్లు. కానీ మా ఓసూరు తేరు అట్ల కాదు. రాయిచక్రాలు, ఇనుము అచ్చులా సుమారుగా 20 అడుగుల పొడవు రాయిలానే తేరును చెక్కిందారు. దీనిపైన ఏదాది ఏదాది మానుతేరును కడతారు. ఈద్చేకి ఇనుము సర్పిణిలు(గాలుసులు) అబుదే చేసి పెట్టిందారు. ఏకాలములో చేసిరో కానీ ఈ కాలానికీ చెక్కుచెదరకుండా ఉండాయి.

“యక్షగానం సురువు అవుతా వుంది. మీరింగా ఈదే వుంటే ఎట్లో పూజురన్న అంటానే గుడి ముందర వున్నోళ్తంతా లేచిరి.

పాటలు, పద్యాలు, మాటలతో అపుటికే ప్రహ్లాదవిజయము జరగతా వుంది.

మునీశ్వరుని గుడితావ రోకలి ఆట ఆదతా వుందారని తెలిసి ఆడికి మాతాత కూదా ఫపోతిని.

సుమారుగా ఆరు అడుగుల పొడవు వుండే రోకలిని తలపైన పెట్టుకానీ కాళ్లకి గజ్జెలు కట్టుకాని ఎగరతా, దుమకతా గిరగిరా తిరగతా ఆట ఆదతా వుంటే చూసేకి బలేగా వుంది. రోకలి కింద పదకుండా బలే న్యాకు(జాగ్రత)గా ఆయప్ప ఆదేఆటకి ఆటతనానీకి ఏమిచ్చినా తక్కువే. మునీశ్వరునీ గుడితావ హరికత,బేటరాయ సామి గుడితావ బుర్రకత, ఎల్లమ్మ గుదితావ శనీమవాత్ళునీ కంసాళి కతలు,

| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ మార్చి-2021 |

!

శివుని గుడితావ వీరకాసి, పందరిబజన, వినాయకుని గుడితావ ఎద్బులాట, నెవులాట, మురుగుని గుడితావ కావడి చీందులు,మారెమ్మ గుదడితావ భారతం కతలు.

ఆటల్ని చూస్తా పాటల్ని కతల్ని వింటా అన్నద్రానాల సత్రాలలా అన్నం తింటా ఆపొద్దు గడిపితిమి.

..

ఓసూరు పరసకి ముందే పల్లకీలు, గెరిగె (గరగ). నేను అమ్మ కూదా గెరిగె జరిగే తావుకి పోతిని.

కంచుపాత్రపైన ద్రౌపదీదేవినీ పెట్టి చుట్టూ మూడు అడుగుల ఫొదవు వరకు మల్లెపూలు అలంకారము చేసుకొని తలపైన పెట్టుకొని తెల్లబట్టలు, కాళ్లకి గజ్జెలు కట్టుకొని వుండాడు. ఇట్ల గెరిగె ఎత్తేవాళ్లు చానాళ్లనీంకా నీయమనిష్టగా వుంటేనే గెరిగె ఎత్తేకి అయ్యేదంట.

గెరిగెను తలమింద పెట్టుకొని ఆదతా వస్తావుంటే గెరిగె కిందపడిపోతే ఆయప్ప తల నరికేకి కత్తులు ఎత్తుకొని చుట్టా కుణనలాదతా వరన వస్తా వుందారు వయసుచిన్నోళ్లు. గెరిగె అయ్యేకంట చూసి ఆమీట తినేకి (చిరుదిళ్లు) తిని ఇంటికి వస్తిని.

వచ్చే వారమే ఓసూరు పరస. ఇంటికి చుట్టాలు వస్తారు, ఇంటికి కావలసిన సరుకులు తీసుకొనేకి నేనూ అబ్బా అమ్మా బండిలా సంతకి పోతిమి.

నంతకి ఒగపళ్మగా రకరకాల రాగులు, వద్దు, నూగులు, జొన్నలు, కొర్రలు, ఉలవలు, సజ్జలు, అనప, కంది, వెనిగ బ్యాళ్లు, సెనగ పప్పు, సెనక్మాయలు, బెల్లము అచ్చులు, చింతపండు మూటలు