వాటిని పాతి ఉంచారు. ఒకచోట వీటిముందుగల ఐదారడుగుల గుంటలో నలుపు, నలుపు ఎరుపు కుండ పెంకులు కనిపించాయి. ఇనుపయుగంలో జనం ఒకచోట కుదురుగా ఉండటానికి గుడిసెలు వేసుకొని మరణించిన వారిని గుంట సమాధుల్లో పాతి, గుర్తుగా వాటి పక్కనే ఇలా నిలువు రాళ్లను పాతి పెట్టే ఆనవాయితీని ఇవి తెలియజేస్తున్నాయి. చిత్రమేమిటంటే, పాతిన నిలువురాళ్లలో, చాలావరకు శిలాజాలను పోలి ఉండటం, కొన్నైతే పెద్ద పెద్ద చెట్లు ఘనీభవించి కొయ్యరాళ్లలా మారిపోయాయా అన్నట్లున్నాయి. గతంలో ఇలాంటి నిలువురాళ్లవద్ద జరిపిన తవ్వకాల్లో బయల్పడిన పురావస్తువుల విశ్లేషణ ద్వారా క్రీపూ. 1500 - 1000 సం॥ల మథ్యకాలాల నాటి మానవులు ఇలాంటి సమాధులు, నిలువు రాళ్లను ఏర్పాటు చేసుకొన్నారని చెప్పవచ్చు. వెల్లటూరు - గొల్లపల్లి నిలువురాళ్లు కూడా క్రీ.పూ. 1000నాటి ఇనుపయుగపు ఆనవాళ్లేనని రుజువైంది. చుట్టుపక్మల ఉన్న ఆవూరి వాళ్లదగ్గరకెళ్ళి వీటి ప్రాచీనతను తెలిపి, పోయినవిపోగా ఉన్న వాటినైనా కాపాడుకోండి అనిచెప్పాం. “కంకర కావలసిన వాళ్లు ఈ నిలువురాళ్లను, పడేసి కొట్టుకుపోతున్నారు. ఆపేవాళ్లే లేరని వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. యుద్దభూమిలో హోరాహోరీ పోరాడి నేలకొరిగిన వారు ఒరిగిపోగా, మిగిలి నిశ్చేప్టులై చూస్తున్న యోధుల్ని తలపిస్తున్నాయి- ఆ నిలువురాళ్లు.
సమయం ఉదయం 7.00 గంటలైంది. బయలుదేరి కనిగిరికి తిరిగొచ్చాం. కనిగిరిలోని చారిత్రక ఆనవాళ్లను వరుసగా చూపిస్తున్నాడు కరుణానిధి. కొండకింద గల ఆలయాలు, కోటగోడ, ద్వారాలను చూపించాడు. కాటమరాజు నిర్మించాడని చెప్పాడు. చారిత్రకాధారాల్ని పరిశీలిస్తే అద్దంకి రాజధానిగ పాలించిన ప్రోలయవేమారెడ్డి నిర్మించిన 84 దుర్దాల్లో కనిగిరి ఒకటని తరువాతి కాలంలో గజపతులు దీన్ని బలపరచి గిరిదుర్గంగా తీర్చిదిద్దారని, శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటను స్వాధీనం చేసుకాన్నాడని చంద్రమౌళిగారు చెప్పింది సబజేననిపించింది.
కొండమీద కోటలో రెండు చెరువులు చెన్నమ్మక్మబావి అనే కోనేరు, అనేక శిధిలదేవాలయాలున్నాయి. కొండమీద కోటగోడను తిన్నగా లాగితే 25 కి.మీల పొడవున సాగుతుంది. ఈ కోటగోడలు, దర్వాజాలు, బురుజులు, గుళ్ళు, కట్టడాలను చూచి, మళ్లీ కాటమరాజే వచ్చి వీటిని బాగుచేయించుకుంటాడేమోనని సరిబుచ్చుకొన్నాం.
కోనేరు దగ్గర ఒక బండకు చెక్కిన ఒక 17వ శతాబ్ది ఆరుపంక్తుల శాసనంలో దాడింరెడ్డి కుమారుడు, దారియినేని రెడ్డి రాబోయే ఒక ఆపద నుంచి తమను హనుమంతుడే రక్షించి కాపాడుతాడని ప్రార్ధిస్తున్న వివరాలున్నాయి. ఉదయం గం౹౹ 9.30 ని. అవుతుంది. ఆకలి దంచుకుంది. కనిగిరిలో మంచి హోటల్‌కుపోయి టిఫిను చేద్దామనుకునేలోపు నా ఫోన్ మోగింది. ప్రముఖ కవి, కథకుడు, చిత్రకారుడు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారిది. ఇక్కడే ఉన్నామని, టిఫిను చేసి కలుస్తామన్నా వినకుండా బలవంతపెట్టి వాళ్లింటి పక్కన ఒక కుటుంబం నడుపుతున్న వరంగల్ మట్టెవాడలాంటి పూటకూళ్లమ్మ గుర్తొచ్చేట్లున్న ఒక చావడి హోటల్‌కు తీసుకెళ్లారు. గరగరలాడే దోసె, దానిమీద సన్నగా చిన్నగా తరిగిన ఉల్లితొనలు, కారెట్టుముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, మరేదో ఫొడిని కొంచెం కారాన్ని చల్లి తిరగేసి పెణంమీంచి తీసిన అట్టుని తింటుంటే, రోజూ ఇక్కడే తింటే బాగుందనిపించింది. నంజుకాన్న కొద్దీ బలంపుంజుకునేట్టున్న వేరుశనగ చట్నీ అల్లం పచ్చడి మానసోల్లాసాన్ని కలిగించాయి ఆతిథ్యంలో భాగంగా టిఫిన్‌ను అందించిన వెంకటేశ్వరరెడ్డి గారికి నమస్మరించాం. ఇంటికి తీసుకెళ్ళి ఆయన కవితాసంపుటి “దుక్కిచూపు” నిచ్చి, తానువేసిన వర్ణచిత్రాలను చూపించాడు. వీడుకోలు తీసుకొని ఎక్కడికెళదామని కరుణానిధిని అడిగాం. పాలేటి గంగమ్మవాగు, వెంగళాపురం వెళదామనగా కారును అటు మళ్లించాం.
కనిగిరి నుంచి ఒక పావుగంట ప్రయాణించిన తరువాత ఒక నదిని దాటాం. చంద్రమౌళిగారు కలుగజేసుకొని, పక్కన కనిపిస్తున్న గ్రామం వెంగళాపురమని, ఇది పాలేటిగంగ(నది) అని చెప్పారు. పాలేటిగంగమ్మ దాటుతుండగా కాటమరాజుకథ మదిలో మెదిలింది. కాటమరాజు తన ఆలమందను 12 ఏళ్లపాటు శ్రీశైలంలో మేపింతర్వాత, శివుని ఆజ్ఞపై కాటమరాజు దక్షిణం వైపు వెళ్లగా-కరువువల్ల నీరు, గడ్డి దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కాటమరాజు ఆలమంద చాలా పెద్దది. అతని పశుసంపదను గురించి కాటమరాజు కథలో “కుదురు ఆరామడ కదులు పన్నెండామడనే” సామెతకు కారణమైందని చెప్పబడింది. బలిజ వారి సలహా మేరకు నల్లసిద్ధిరాజ్యానికి మందను మళ్లిద్దామనుకొని పినతల్లి సిరిదేవికి చెప్పగా, వద్దని వారిస్తుంది. వినకుండా కాటమరాజు, తన వారితో కలిసి ఆలమందను పాలేటివాగు దగ్గరకు తోలుకొస్తాడు. గంగను దాటాలనుకుంటున్న కాటమరాజుతో గంగ తనను చేతులెత్తి మొక్కితేనే దాటనిస్తానంటుంది. ఇష్టపడని కాటమరాజు వాదోపవాదాల తరువాత, నమస్మరించగా, అంగీకరించిన గంగ, ఎండిపోయిన వాగులో నీటిని రప్పించింది. కాటమరాజు తన ఆలమందతో పాలేటిని దాటి నెల్లూరు సీమకు బయలుదేరి వెళ్ళిన సంఘటన గుర్తుకొచ్చింది. అలా నెమరు వేసుకుంటుండగా, వెంగళాపురంలోనున్న కాటమరాజు కథకు సంబంధమున్న అయితమరాజు విగ్రహం, పాలేటి గంగమ్మ అని పిలుస్తున్న మహిషాసురమర్దిని విగ్రహం దాని తరువాత అలవలపాడులోని వాగు ఒడ్డునున్న ఒక బండపై గల క్రీ.శ 1526 వ సం॥నాటి రాపురి రాఘవరెడ్డి, తన తండ్రి బస్పరెడ్డి, తల్లి అమలాంబికకు పుణ్యంగా లింగాలకొండ సోమేశ్వరునికి, బంగాది గంగ (పాలేటిగంగ) కు కొండమరుసయ్యగారు ఇచ్చిన నాయంకరంలోని కనిగిరి పోలచెర్ల, ముసుండూరి సీమలోని గంగపట్నాన్ని షోడశోపచారాలకు ఇచ్చినట్లు పేర్కొంటున్న శాసనాక్షరాల్ని తడిమి చూచాం.
ఇంతలో, కరుణానిధి, మమ్మల్ని పంచలింగాల కొండవైపు మళ్లించాడు. పంచలింగాలకొండ కూడా కాటమరాజుకు
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021
36