పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(540)6900. మొదటి వాక్యంలో 000% విధేయము (21840219). రెండవ వాళ్యంలో 000% ఆఖ్యాతము (84). ఈ భేదం కంప్యూటర్‌ గుర్తించ గలగాలి. వ్యక్తి నామాలను గూడ గుర్తించ గలగాలి. ఈ (ప్రక్రియలో లోపం ఎళ్ళడైనా జరిగితే దానీనీ తెలుసుకోడానీకి వాక్య విశ్లేషణ తోద్చదాలి.

అనువాదం: వమూలభాషలోని వాళ్వాన్ని లక్ష్యభాషలోనికి అనువాదం చెయ్యాలి. కంప్యూటర్‌ మూలభాషలోని పదాలను లక్ష్యభాషలోకి వరునగా అనువదిస్తుంది, కానీ వాక్యనీర్మాణం మూలభాషలో వుంటుంది. ఒక భాషలో వున్న వాక్యనిర్మాణం వేరొక భాషలో వుండకపోవచ్చు. అందుచేత యంత్రానికి మూలభాష్క అక్ష్యభాషల వాళ్యనీర్మాణాలు తెలియాలి. అంతేకాదు భాషా సంప్రదాయం తెలియాలి. అనువదింపబడిన పదాలను లక్ష్యభాషా నిర్మాణానికి అనుగుణంగా అమర్చుకోవాలి. లక్ష్యభాష యొక్క నుడికారం తెలిసుండాలి. అంతేగాదు తన వ్యాకరణ పరిజ్ఞానాన్ని అనువర్తింపచేయగల సామర్ధ్యం కూడ వుండాలి. “ఈ దుకాణం దగ్గర నాకు కొంచం పనివుంది” అన్న వాళ్యాన్నీ “ఇస్‌ దుకాన్‌ కె పాస్‌ తోడా కామ్‌ హై” అనడాన్ని హిందీ మాతృభాషా వ్యవహర్తలు తప్పు పడతారు. “ఇస్‌ దుకాన్‌ పర్‌(మీద) తోడా కామ్‌ హై” అనాలంటారు. అనువాదకుడికి నుడికారం తెలిసుండాలి. “| & 14000” అన్న ఇంగ్లీషులోని కర్తద్ధక వాళ్వాన్నీ తెలుగులో భావార్థక వాక్యంగా “నాకు ఆకలిగా వుంది” అనీ అనువదించాలి. ఇక్కడ “నాకు” కర్తా? కర్మా? “నేను రాయికి తగిలాను” అనడానికి బదులుగా తెలుగువాళ్ళం “నాకు రాయి తగిలింది” అనీ అంటున్నాం. కర్తను పరోక్ష కర్మను చేసి రాయిమీద నేరం మోపుతున్నాం కదా!

“౧19 19 & 006 000/౯” అన్న వాళ్యానీకి అనువాదం “ఇది మంచి పుస్తకం”. “119 000% 16 గ006” అన్న వాక్సాన్ని తెలుగు భాషా వ్యాకరణాన్నీ అనుసరించి “ఈ పుస్తకం మంచి+ది” అని అనువదించాలి. “జు 2 ౧౧౬౫. ౫06 జం & గజ” అన్న వాక్యాలను “నేను మనిషి+ని, నువ్వు మనీషి+వి” అనీ అనువదించాలి. “నేను మనిషి. నువ్వు మనిషో అనడం జెలుగు సంప్రదాయం కాదు.

వాళ్యాలలోని పదాలస్థానం మార్చడమే కాదు ఒక పదంలోని

పదాంశాలను గూడ వెనుక ముందు చేయవలసి వుంటుంది. తెలుగులో *నా పుస్తకలొ అన్న సమాసంలో *'నా” అన్న సంబంథబోధక సర్వనామం తరవాత నామవాచకం వస్తుంది. చాలా భాషలలో ఇలాగే వుంటుంది. సవరభాషలో దీనికి విరుద్దంగా నామవాచకం తరవాత సంబంధబోధక సర్వనామం వస్తుంది. సవరభాషలో “కంటో న్‌” కంబోల్‌ + ఇిన్‌ (పుస్తకంనా” పుస్తకం +నా” అనాలి. మన భాషలలో విశేషణం తరువాత విశేష్యం వస్తుంది. సవర భాషలో విశేష్యం చరువాత విశేషణం వస్తుంది. “ఒసి” వ “పిల్లపసి” అంటే “పసిపిల్ల” అనీ అర్థం. సవర భాషలో విశేషణానీకీ నామవాచకానికీ మధ్య ఖాలీ వుంచకూడదు.

“నేను ఆంధ్రప్రదేశ్‌ నుండి వచ్చాను” అన్న వాక్యాన్ని “నాన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఇల్‌ ఇరుందు వందేన్‌” అంటే తమిళుడు ఒప్పుకోడు. “నాన్‌ ఆంధ్రప్రదేశత్తు ఇల్‌ ఇరుందు వందేన్‌” అనాలంటాడు. “ఆంధప్రదేశ్‌ అన్న పొందీ పదాన్ని 'ఆంధ(ప్రదేశ+ము గా మార్చుకోవాలి. తరువాత తమిళ ప్రత్యయం 'ఇల్‌ 'ముందున్న “ము” “త్తు గా మారుతుంది అన్న తమిళ సంధి సూత్రాన్నీ అనువర్తింప జేసుకోవాలి. అంటే మన కంప్యూటర్‌కి ఉభయ భాషల వ్యాకరణం పూర్తిగా రావాలన్నమాట.

కంప్యూటర్‌ ద్వారా అనువాదం చేసేటప్పుడు కొన్నీ కాన్ని అనీష్టరూపాలు ఉత్పన్నం అవుతుండడం చూస్తూనే వున్నాం. తప్పు ఎక్కడ జరిగిందో తెలియాలంటే కంప్యూటర్‌ అనువాదం చేసే విధానం తెలియాలి. మూలభాషలోని వాక్యం లక్ష్యభాషగా వెలువడే ముందు కంప్యూటర్‌ గర్భంలో జరిగే ఈ రూపవిక్రియను కనిపెట్టి సవరించుకొంటే అనువాదంలో అనిష్టరూపాలు వెలువడవు.

వాక్యమే పూర్తి అర్థం ఇస్తుంది కాబట్టి వాక్యం పూర్తయినంతవరకు అర్థం అగోచరం. అందుచేత వాక్యం పూర్తిగా రాసిన తరవాత “ట్రాన్స్‌లేటొ అన్న కమాండ్‌ మీట నొక్కగానే నా కంప్యూటర్‌లో అనువాద విధానం ప్రారంభం బెళుంది. ఈ కార్యక్రమమంతా పూర్తయిన తరువాత కంప్యూటర్‌ తెరపై మనకు అనువాదం కనిపిస్తుంది. కంప్యూటర్‌ ప్రోగ్రాం ఏదీ పరిపూర్ణం కాదు. ఒక వెర్షన్‌ తరువాత దానిని అభివృద్ధి చేస్తూ మరొక వెర్షన్‌ వస్తుంది. నిత్యం పరిశోధన చేస్తూనే వుంగాలి.

సంచారి బుర్రకథ ఈరమ్మ (జీవితచరిత్ర)

శ$| వెల: రు. 80/-

1 రచయిత: దా. నింగప్పు ముదేనూరు (కన్నవమూలం)

రంగనాథ రామచలంవ్రరావు (అనువాదం)

ప్రతులకు: ఛాయా రిసోర్సెస్‌ సెంటర్‌, హైదరాబాదు. ఫోన్‌: 9848023384 ౧౧ 20౧22010.1% నుండి కూడా పొందవచ్చు.

| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ మార్చి-2021 |

కన్నడ తోటలో విరిసిన ఎందరో తెలుగు కళాకారులలో ఒకరు బ్యురకథ ఈరమ్మ. బుడగ జంగాలు అనబడే ఒక ఆదిమకులానికి చెందిన ఈరమ్మ తన సంచార జీవితంలో కర్దాటకాంధ్రలో బుర్రకథ చెప్పడంలో పేరు గడించింది. ప్రజాదరణతోపాటు, ఎన్నో పురస్మారాలను పొందింది. ప్రతిష్టాత్మకమైన “కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారాన్ని, హంవి కన్నడ విశ్వవిద్యాలయం నుంది గౌరవ తాక్టరేటునూ ఆమె పొందింది. ఈరమ్మ చరిత్రను కన్నడంలో దా.నీంగప్ప ముదేనూరు రచించగా రంగనాథరామచంద్రరావు తెలుగులోకి అనువదించారు. అమ్మనుజెలో ధారావాహికగా వెలువడింది.