పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమ్మనుడి పండుగ ప్రత్యేకం

డా. గట్ల ప్రవీణ్‌: పి. ప్రకాష్‌

తెలంగాణా తెలుగు భాషాభివృద్ధి: భాషానిధి ఆవశ్యకత

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆర్థిక, భౌగోళిక, రాజకీయ, సామాజిక అంశాలతోపాటు, తెలంగాణ భాష కూడా ప్రముఖ పాత్రను ఫోషించిందన్న విషయం అందరికీ తెలిసినదే. దానికి ముఖ్య కారణం మనం మాట్లాడే తెలుగు ప్రామాణిక తెలుగు కంటే భిన్నంగా ఉండడమే. అంతే కాకుండా తెలంగాణ తెలుగు అవహేళనకు గురవుతందనే భావన తెలంగాణలో చాలా బలంగా నాటుక పోయింది. అందువలన ఎక్కడ చూసినా ప్రామాణిక తెలుగు (వాడుకలో) తప్ప, మనం మాట్లాడే భాష ప్రభుత్వ విద్య, సినిమా, దినవారమాస పత్రికలలో వివిధ రంగాల్లో ఉండక పోవడం లేక ఆడక పోవుట్ల తెలంగాణా తెలుగుకు ఒక ప్రత్యేక గుర్తింపు రాకపాయే. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ప్రజలంతా గొంతెత్తి మా నీళ్లు మాకేనని, మా ఉద్యోగాలు మాకేనని, మా భూములు మాకేనని అన్న గద్దరన్న మాటలూ పాటలూ, కళాకారుల పాటలూ, కార్మికుల ఆకలికేకల రాగాలూ మొదలైనవి ప్రజలలోకి చొచ్చుకొని పోయి ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. ఇలాంటి నినాదాలు ప్రజల్లో ఎంత ప్రభావాన్ని చూపాయో, అదే విధంగా మన తెలంగాణ భాష కూడ అంతే బలంగా ఉద్యమంలో పని చేసింది అని చెప్పవచ్చు. అదే విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాట సమయంలో ముందెన్నడూ రానంత విధంగా తెలంగాణలో జ్ఞాన సృష్టి, సాహిత్య సృష్టి జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మాటలూ, ఆటపాటలూ, ఉద్యమ గేయాలూ, కవితలూ, తెలంగాణ బతుకు తెరువును చిత్రీకరించే కథలూ మొదలైనవి. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకూ రకరకాల రచనలు చేశారు. ఈ సాహిత్యమంతా కేవలం తెలంగాణ గురించి కాకుండా వారి బతుకు చిత్రాన్ని కళ్లకు కట్టినట్టుగా చిత్రీకరించారు. ఇవన్నీ ప్రజల భాషలో అంటే తెలంగాణ మాండలికంలో రావడం వలన, అవి ప్రజల మనస్సుల్లోకి చాలా లోతుగా చొచ్చుకొని, పాతుకు పోయాయి. ఇక్కడ మనం మరో విషయాన్ని గమనించాలి, ఏదైనా ఒక విషయం మన సొంత భాషలో అంటే మన మాతృభాషలో అమ్మభాషలో వ్యక్తపరిస్తే అది మన హృదయానికి ఎంత బలంగా హత్తుకుంటుందో మనం అనుభవించే ఉంటాము. దీనిని బట్టి మనం మాతృభాష ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

{{c|తెలంగాణ తెలుగు |]]

తెలంగాణ తెలుగుకూ, ప్రామాణిక తెలుగుకూ మథ్య వ్యత్యాసం ఉందన్న విషయం మనందరికీ తెలిసినదే. అవి ధ్వని వర్ణ, పద, వాక్య, అర్ధ స్థాయిలలో ప్రస్పూటమవుతాయి. మన మాండలికం ప్రామాణిక తెలుగు కంటే భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు వచ్చాడు :: వచ్చిండు, పోయాడు :: పోయిండు, తింటాడు :: తింట్టుండ్రు, అబ్బాయి :: పిల్లగాడు, వంకాయ ::అంకాయ మొదలైనవి. తెలంగాణ తెలుగును అన్ని రంగాల్లో ఆడకుండా నిర్లక్ష్యం చేయడానికి రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాలు ఉండివుండవచ్చు. ఈ విషయం తెలంగాణ సామాన్య ప్రజలు గ్రహించడం వలన, అన్ని సమస్యలతో సమానంగా తెలంగాణ భాష కూడా ఉద్యమంలో అంతే బలంగా తెలంగాణ పోరాటంలో పనిచేసిందని చెప్పవచ్చు. కానీ తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత, తెలంగాణ భాష గురించి ప్రభుత్వం చేసింది తక్కువ అని చెప్పవచ్చు. కానీ తెలంగాణ భాషను చూసే దృష్టి కోణంలో ఎంతో మార్పు వచ్చింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర, సినిమా, దృశ్యశ్రవణ మాధ్యమం మొదలైన రంగాలలో తెలంగాణ భాష అవహేళనకు గురైంది. అందులో ముఖ్యంగా సినిమా రంగంలో చాలా విరివిగా కనిపించేది. ఎందుకంటే సినిమాలో ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలకు లేదా విలన్‌ పాత్రలకు మాత్రమే తెలంగాణా యాస ఎక్కువగా ఉపయోగించేవారు. ఉదాహరణకు తెలంగాణ శకుంతల అనే నటీమణికి డైలాగ్స్‌ తెలంగాణ మాండలికంలోనే రాసేవారు, చెప్పించేవారు కూడా. అందువలన జనాల్లో తెలంగాణా భాష పట్ల సినిమా రంగంలో, పరిపాలనా రంగంలో ఛిన్న చూపు ఏర్పడింది. కానీ తెలంగాణ వచ్చిన తరువాత తెలంగాణా భాష కేవలం సినీమా రంగంలోనే కాకుండా అనేక రంగాల్లో ఎంతో మార్పును తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఉదాహరణకు కరీంనగర్‌, వరంగల్లు జిల్లాల్లో, సికింద్రాబాదు, హైదరాబాదు జంట నగరాలలో హోటళ్ల పేర్లూ. భోజన శాలల పేర్లూ, కర్రీ పాయింట్ల పేర్లూ తెలంగాణ పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా పెడుతున్నారు. కానీ అంతటితో సరిపోదు. మనం తెలంగాణా భాషనూ మరింత అభివృద్ది పరుచుకోవాలి. అప్పుడే మనం తెలంగాణా ఉద్యమంలో నినదించిన నినాదాలు సార్థకమవుతాయి. అప్పుడే మన భాష మన యాస అనే నినాదానికి సరైన అర్ధం లభిస్తుంది. అందుకోసం తెలంగాణా భాషను అన్ని రంగాల్లోకి విస్తరించాలి. ఇప్పటికే తెలంగాణ తెలుగుపై అనేక భాషల (మరాఠీ, కన్నడం, ఉర్ధూ, పర్షియన్‌) ప్రభావం ఉండడం వలన, అందులో ఎంతో వైవిధ్యం కలిగి ఉండడం చేత, తెలంగాణ తెలుగు ఒక భాష కాదని అదొక మాండలికమే అనే భావన ప్రజల్లో ఇంకా ఉంది. కావున మనం దీనిని శాస్రీయంగా నిరూపించాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ తెలుగు పై పూర్వ పరిశోధనలు

ఇప్పటి వరకు చాలా మంది తెలంగాణా తెలుగుపై కొన్ని చెప్పుకోదగ్గ పరిశోధనలు చేశారు, అందులో ముఖ్యమైనది తెలుగు అకాడమీ, హైదరాబాదు. తెలుగు అకాడమీ ప్రచురించిన జిల్హాలవారీ మాండలికాల బులెటెన్లూ, తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలంగాణా రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి తెలంగాణా తెలుగు భాషానిధిని సమకూర్చి నిఘంటువులను అందుబాటులోకి తెస్తున్నారు అని ప్రచారంలో ఉంది. కానీ ఇంతవరకూ కార్యరూపం దాల్చినట్టుగా అయితే కానరాలేదు. దానికి పరిశోధకుల కొరత, నిధుల కొరత, ఇంచార్జీ ఉపకులపతులతో విశ్వవిద్యాలయం నడపడం ఇలాంటి అనేక కారణాలు కావచ్చు. ఇంకా చాలా మంది పరిశోధకులు వివిధ తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఉ ఫిబ్రవరి-2021 |