పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మోదుకూరు(కృష్ణాజిల్లా-ఆం. ప్ర)లో తెలుగుజాతి కవి 'వేమన సాహిత్య వికాస పరిషత్‌” భవనం

వేమనను గుండెల్లో నిలుపుకొన్న 'మోదుకూరు”

గుంటూరు జిల్లాలో తెనాలికి దగ్గరలో చైతన్యవంతులైన రైతు కుటుంబాలున్న ఒక ప్రముఖ గ్రామం మోదుకూరు. 1929 నుండే వేమన జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా జరపడం వీరు మొదలు పెట్టారు. ఈ సందర్భంగా వేమన పద్యాల ప్రచారంతో పాటు సాంస్క్మ లతిక కార్యక్రమాలను నిర్వహించడాన్ని ప్రతి ఏటా ప్రతిమాత్మకంగా చేస్తున్నారు. క్రమంగా ఒక చిన్న [గ్రంథాలయాన్ని సాంస్కృతిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకొన్నారు. జయంతి ఉత్సవాల్తొ ఎందరో పండితులు, కవులు, రాజకీయ నాయకులు, పాలకులు, సాహిత్యవేత్తలు, ఉద్యమకారులు పాల్గొంటున్నారు. దీనిని సంకల్పించి నిర్వహించిన వారిలో ముఖ్యుడు క్రీ మొవ్వా వీరారెడ్డి గారు ఇప్పుడాయన మనుమడు డా॥మొవ్వా శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం నుండ్చి, గ్రామపెద్దలు, మిత్రుల నుండి విరాళాలు సేకరించి, పట్టుదలగా కొన్నేళ్లు శ్రమించి అందమైన పెద్ద సభాభవనాన్ని నిర్మించారు. దానీ పేరు వేమన సాహిత్య వికాస పరిషత్‌. 90 ఏళ్లుగా జరుగుతున్న వేమన జయంతి కా [(క్రమాలకు ఇకపై ఈ భవనం కేంద్రం కానున్నది. అంతేగాక ఇకపై మరికొన్ని విశిష్టమైన కార్యక్రమాలను కూడా అందరి సహకారంతో నిరంతరం నిర్వహించనున్నామని డా॥ మొవ్వా శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

ఈ భవనం ప్రారంభోత్సవం 2021 జనవరి 19న ఘనంగా జరిగింది. ఆరోజంతా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు 2 పుస్తకాలను ముద్రించి విడుదల చేశారు. అవి: 1.కొడాలి లక్ష్మీనారాయణ, తియ్యగూర సీత్రారామిరెడ్డి రచించిన మోడుకూరు గ్రామచరిత్ర 2. చక్రాల దుర్గానంద్‌ రచించిన శబ్దగాండీవి వేమన. (ఈ పుస్తకంలోని పెద్ద వ్యాసంతోపాటు మరికొందరు ప్రముఖులు వేమన గురించి వ్రాసిన వ్యాసాలను “నడుస్తున్న చరిత్ర, “అవ్మునుడె పత్రికల్లో తొలుత ప్రచురించిన సంగతి తెలిసిందే.)

(గ్రామస్తులంతా తరలివచ్చి సభను జయప్రదం చేశారు. ఎందరో అధికార, అనధికార ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పండితుల, విద్యావేత్తలు పాల్గొన్నారు. ఇంత గొప్పగా భవన నిర్మాణాన్ని ప్రారంభోత్సవ 'క్రార్యక్రమాన్ని నిర్వహించిన

-అమ్మనుడి