పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని

2021 ఫిబ్రవరి 21న ఎల్లెడలా నిర్వహిద్దాం

{{c|తెలుగు భాషోద్యమ సమాఖ్య పిలుపు |}]

ప్రతి ఏటా ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవంగా జరుపుకోవాలని యునెస్కో (ఐరాస) పిలుపు ఇచ్చింది. అ పిలుపునందుకొని 2000 సం. నుండి ప్రపంచమంతటా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2003లో అదే రోజున తెలుగు భాషోద్యమ సమాఖ్యను స్థాపించి, ప్రతి ఏటా ఫిబ్రవరి 21న తెలుగు ప్రాంతాలన్నింటా యునెస్కో సందేశాన్ని ప్రచారం చేస్తూ ఆ సందర్భంగా అనేక కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

“మాతృభాష (అమ్మనుడి) లో చదువులు, ప్రజల భాషలో పరిపాలనా అనే ఆశయంతో అనేకమంది భాషోద్యమకారులు, విద్యా సంస్థలు, సంఘాలు, కృషి చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోని తెలుగు తావుల్లోనూ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకొందాం. దీనికి మరింత సరళమైన తెలుగుమాటగా - “ఎల్లనాడుల అమ్మనుడుల పండుగ” అని పిలుచుకొందాం. ఈ మాటను విస్తారంగా ప్రచారంలోకి తెద్దాం.- తెలుగు భాషోద్యమ సమాఖ్య

విద్య, సామాజ ప్రగతికై అనేక భాషలను ప్రోత్సహించాలి

మాతృభాషలోనే తొలి చదువులుండాలి: 'యునెస్కో పిలువు

2021 సంవత్సరపు అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం ప్రభానాంశం “విద్య, సమాజ ప్రగతికి అనేక భాషలను ప్రోత్సహించడం అని “యునెస్కో ప్రకటించింది. ఏ ఒక్కరిని వెనుకబడనీయకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగడానికి ప్రతీ ఒక్కరూ పలు భాషలు నేర్చుకోవడం ముఖ్యమని యునెస్కో భావిస్తోంది.

చిన్నవయసు నుండి విద్య మాతృభాషలోనే ప్రారంభం కావాలని, తద్వారా మాత్రమే విషయ పరిగ్రహణకు చక్కని పునాది పడుతుందని అంతర్జాతీయ స సంస్థ యునెస్కో నమ్ముతోంది.

అనేక భాషలు “క్రమేణా ఆంతరించి పోతున్నందువల్ల ప్రస్తుత ప్రపంచంలో భాషావైవిథ్యం ప్రమాదంలో పడింది. ప్రపంచ వ్యాపితంగా దాదాపు 40 శాతం ప్రజానీకానికి వారు మాట్లాడే, లేదా అర్థం చేసుకునే భాషలో చదువుకునే అవకాశం లేకుండా పోతోంది.

పలు భాషలు, పలు సంస్కృతులతో కూడిన సమాజాలు కేవలం వారి వారి భాషల ద్వారా మాత్రమే ఉనికిని పొందుతున్నాయి. అవి మాత్రమే వారి సంప్రదాయాలను, జ్ఞానాన్ని సంస్కృతిని ముందుకు తీసుకుపోతాయి. అందువల్ల మాతృభాషతో కూడిన అనేక భాషల మ ఎక్కువమందిని నా





వైవిధ్యం

ఆఅ ఆ

ఉత్తమ జ్ఞానసాధన నిలకడైన అభివృద్ధికై (ప్రాథమీక సామాజిక ఏకత, సాంస్కృతిక వ్యవస్థలు, ప్రపంచ వినిమయం, శాంతిని, మానవహక్షులు, అక్షరాస్యత, బీదరికాన్ని విలువలు, వైవిధ్యం, అవగాహన సయోధ్యను స్థానిక ప్రజలకు తగ్గించడం, వారసత్వం నెలకొల్బడం స్వాతంత్ర్యం అంతర్జాతీయసహకారం

ఈ లక్ష్యాల సాధన కోరు విద్య మాతృభాషలోనే ప్రారంభం కావాలి


| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఉ ఫిబ్రవరి-2021 |