పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

...అంతా రామమయం

(సారస్వత వ్యాసాలు

లటాఠి


ఈ గ్రంథ రచయిత విహారి ప్రసిద్ధ సాహితీవేత్త, కథారచయిత, నవలారచయిత, కవి. దాదాపు 40కి పైగా గ్రంథాలు రచించారు. 40 సంస్థల నుండి అవార్డులు పొందారు. పలు పత్రికల్లో శీర్షికలు నిర్వహించారు. ఎంతోమంది కథారచయితల జీవిత విశేషాల్ని పాఠకులకందించారు. వీరి రచనల్లో సమాజాన్ని ఎంతో నిశితంగా పరిశీలించిన వైనం కనబడుతుంది. ఈ గ్రంథ రచనకు ముందే “శ్రీపదచిత్ర రామాయణం” అనే కావ్యాన్ని రచించారు. కరోనా సంవత్సరంగా ముద్రపడిన 2020లో వెలువడింది “అంతా రామమయం. దాదాపు ఇందులోని వ్యాసాలన్నీ ఇంతకుముందే 'భక్తి మాస పత్రికలో ప్రచురించారు.

లోకంలో రాముడంటే దేవుడనే నమ్మకం ఉంది. మనిషికి, సమాజానికి మంచి చేసే లక్షణం రామాయణంలో ఉందని- విహారి ప్రగాఢ విశ్వాసం. అందుకే వాల్మీకి రామాయణంలోని 16 పాత్రలనుగూర్చి 6 కాండలలోని థర్మసూక్ష్మాలను గూర్చి విశదంగా విస్పష్టంగా వివరించారు. ఇంకా తక్కిన వ్యాసాల్లో తెలుగులో వెలసిన పద్యరామాయణాలను గూర్చి కావ్యరూపంలో ప్రకటితమైన రామాయణాన్ని వివరించారు. వాల్మీకి రామాయణాన్ని సమాజ దర్చణంగా వర్ణించి, శ్రీరామతత్వాన్ని లోకానికి విశదపరచారు.

రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను ధర్మము, శ్రద్ధ, భక్తి శక్తి రూపుదాల్చిన మూర్తిమంతులుగా- వాల్మీకి తీర్చిదిద్దారని తెలిపారు. రామాయణం ద్వారా వాల్మీకి సమాజానికి రామునిలా ప్రవర్తించు, రావణునిలా కాదనే సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. రామాయణంలో వాల్మీకి తీర్చిదిద్దిన పాత్రల గుణగణాల్ని చక్కగా వివరించారు.

కళ్యాణధాములైన శ్రీరామసోదరులకు విశ్వామిత్రుడు బోధించిన గృహస్థాశమ ధర్మాల్ని పురుషార్ధాల ప్రాధాన్యాన్ని సామాజిక హితైకాభిలాషులు వ్యక్తిగత సుఖభోగాల్ని త్యజించాల్సిన ఆవశ్యకతను వివరించారు. వాల్మీకి చెప్పిన రామాయణంలో లేని వశిష్టగీత లేదా యోగవాశిష్టాన్ని గూర్చి, దానిపై వచ్చిన వ్యాఖ్యానాలను గూర్చి తెలిపారు.

వాల్ళీకి రామాయణాన్ని గురించి సంగ్రహంగానైనా సరైన అవగాహన కోసం ఆధారపడదగిన రచన ఇది. రచయిత కృషి ఎంతైనా అఖినందించవగినది.

వెల:రు. 150/-

ప్రతులుకు: జె.ఎస్‌. మూర్తి (విహారి) 16-11-310042ఏ/1/1/

గణపతిగుడి వీధి, సీలంనగర్‌-2, మలక్‌పేట, 'హైదరాబాద్‌-500 036

సెల్‌ 98480 25600

డా|| వెన్ని సెట్టి సింగారావు సెల్‌ : 9893015584.

ఉసురు కింద ఉరిబాధ

శిక్షాస్మృతి కాలంలో సూదులై గుచ్చే స్వప్పాల్లోనే మనిషి బ్రతుకు మొత్తం

దేవులాడే కళ్ళల్లోనే దేవుడి ఆలోచన దెయ్యం నీడై నిలబడ్డ చీకటి

నీడను నైతికానైతికాల సానమీద అరగదీసే

మందితో మతం

కులంతో గుంపు

అపరిచితంగా వీథి బంథమాక్రమిత దుఃఖంలో ఇల్లు

వెలివేతల వెలితిలో ఉసురకింద ఊపిర్ని బిగదీస్తున్న ఉరిబాధ

శిక్షాస్మృతులు సూదులై గుచ్చే స్వప్పాల్లోనే మనిషి బ్రతుకు మొత్తం

పాపికి పాపం తెలియదు! శిక్షకు పుణ్యం తెలియదు దేవులాదే కళ్ళల్లోనే

జీవితాన్ని కూల్చుకుంటున్న మృత్యునీడ

బలిసూత్రం త్రాసుతో (బతుకుల్ని తూచే నైతీకానైతికాల మధ్య మతంతో మంది కులంతో గుంపు అపరిచితంగా వీధి బంధాలు ఆక్రమించే దుఃఖంలో ఇల్లు

-దుర్గాప్రనాద్‌ అవధానం 94926 08314


తెలుగువారింట జరిగే పెళ్లీ అయినా పండుగ అయినా పిలుపు

తెలుగులో ఉండాలి. స్వాగత స తెలుగులో ఉండాలి.


| తెలుగుజాతి పత్రిక ఇవ్వునుడి ఉ ఫిబ్రవరి-2021 |